మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ హ్యాట్రిక్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభం

Maheshbabu trivikram new project launched today. సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌లో హ్యాట్రిక్‌ కాంబో ప్రాజెక్టు మొదలైంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌

By అంజి  Published on  3 Feb 2022 8:27 AM GMT
మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ హ్యాట్రిక్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభం

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌లో హ్యాట్రిక్‌ కాంబో ప్రాజెక్టు మొదలైంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో మహేష్‌ బాబు 28వ సినిమా రూపుదిద్దుకోనుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇవాళ ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమం రామానాయుడు స్టూడియోస్‌లో గ్రాండ్‌గా జరిగింది. సినిమా యూనిట్‌తో పాటు మహేష్‌ బాబు భార్య నమత్ర ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక సినిమాలో మహేష్‌ సరసన హీరోయిన్‌ పూజా హెగ్డే నటిస్తుంది. అయితే ఈ వేడుకకు మహేష్‌ బాబు దూరంగా ఉన్నారు. మహేష్‌ బాబు 28వ సినిమాకు మ్యూజిక్‌ను ఎస్‌.ఎస్‌.తమన్‌ అందిస్తున్నారు.

ఈ కొత్త సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మార్చి నుండి ప్రారంభం కానున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. ఇప్పటికే మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబోలో 'అతడు', 'ఖలేజా' సినిమాలు వచ్చాయి. మూడో సారి ముచ్చటగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఓ పవర్‌ఫుల్‌ స్టోరీతో సినిమాను తెరకెక్కించబోతున్నారని తెలిసింది. మహేష్‌ బాబు ప్రస్తుతం సర్కార్‌ వారి పాట సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాకు గీతా గోవిందం ఫేం డైరెక్టర్‌ పరుషరాం దర్శకత్వం వహిస్తున్నారు.

Next Story
Share it