By Medi Samrat Published on 9 March 2021 11:57 AM GMT
అక్కినేని వారసుడు టాలీవుడ్ లవర్ బాయ్ యువ సామ్రాట్ నాగ చైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో "థాంక్ యూ" అనే సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమాలో నాగ చైతన్య సూపర్ స్టార్ మహేష్ బాబుకి వీరాభిమానిగా నటించబోతున్నాడు.మహేష్ బాబుకి సూపర్ స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన 'ఒక్కడు' సినిమా రిలీజ్ సమయంలో హడావిడి చేసే అభిమానిగా చైతు ఈ సినిమాకి కనిపిస్తాడట.దీనికోసం గడ్డం, మీసం తీసేసి చిన్న కుర్రాడిలా మారిపోయాడు చైతు. ఈ లుక్ తోనే తాజాగా చైతుపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక థియేటర్ ముందు మహేష్ బాబు భారీ కటౌట్ పెట్టి.. దాన్ని చైతూతో ఆవిష్కరించే సన్నివేశాలను చిత్రీకరించారు.
Here we Goo.. A special edit 🔥🔥 Don't miss the end..🤙
— KhalejaYaswanth SSMB 😍 (@khalejaYaswanth) March 8, 2021
కటౌట్ పైకి చైతు నిచ్చెన ద్వారా వెళ్లడం, పైన తెరను తీసి మహేష్ కటౌట్ ఆవిష్కరించి విజిల్స్ వేసి.. సంబరాలు చేసుకోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో, ఫోటోలు చూసిన మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో 'థాంక్యూ' సినిమాని ట్రెండ్ చేస్తున్నాయి. 'ఒక్కడు' సినిమా రోజులను గుర్తు చేసుకుంటూ ఖుషీ అవుతూ నాగ చైతన్యకి తమ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఇక మహేష్ సినిమాకి ఎలాంటి హడావిడి ఉంటుందో నాగ చైతన్య "థాంక్ యూ" సినిమాకి కూడా అంతే హడావిడి చేస్తున్నారట సూపర్ స్టార్ సూపర్ ఫ్యాన్స్..