'బాబు' షర్ట్ లేకుండా కనిపించడంతో..!

Mahesh Babu's Shirtless Picture In a Pool Is Too Hot To Handle. సూపర్ స్టార్ మహేష్ బాబు షర్ట్ లేకుండా కనిపించిన దాఖలాలే లేవు

By Medi Samrat  Published on  20 Aug 2022 2:27 PM IST
బాబు షర్ట్ లేకుండా కనిపించడంతో..!

సూపర్ స్టార్ మహేష్ బాబు షర్ట్ లేకుండా కనిపించిన దాఖలాలే లేవు. వన్ నేనొక్కడినే సినిమా సమయంలో మహేష్ బాబు సిక్స్ ప్యాక్ తో రచ్చ చేస్తాడని వార్తలు ప్రచారం అయ్యాయి. మంచి బాడీని ఆ సినిమా కోసం మహేష్ బాబు మెయింటైన్ చేసినప్పటికీ తనకున్న సిగ్గు కారణంగా షర్ట్ తీసేయలేకపోయాడు. అయితే మొదటిసారి మహేష్ బాబు షర్ట్ లెస్ గా కనిపించాడు. తాజాగా మహేష్‌ సతీమణి నమ్రత శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ పిక్‌లో మహేష్ ఫస్ట్ టైమ్ షర్ట్ లేకుండా స్విమ్మింగ్‌ పూల్‌లో కనిపించాడు. మహేష్ బాడీని ఫస్ట్ టైమ్ చూస్తున్నాం అంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.

స్విమ్మింగ్ చేస్తూ.. కంటికి స్విమ్మింగ్ అద్దాలతో.. పైన క్యాప్ తో మహేష్ బాబు కనిపించాడు. ప్రస్తుతం మహేష్ బాబు రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి త్రివిక్రమ్‌తో సినిమా కాగా మరొకటి రాజమౌళితో. ఈ రెండు సినిమాలు ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. త్రివిక్రమ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను నిర్మాతలు ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేస్తామని వెల్లడించారు.

Next Story