మహేష్ అభిమానులకు ప్రీ రిలీజ్ ఈవెంట్ షాక్
మహేష్ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
By Medi Samrat Published on 5 Jan 2024 9:15 PM ISTమహేష్ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అయితే జనవరి 6వ తేదీ సాయంత్రం జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. జనవరి 6వ తేదీ హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు ముందుగా ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ. అయితే 24 గంటల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయినట్లు ప్రకటించటంతో మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించాలని భావించింది చిత్ర యూనిట్. పోలీస్ పర్మీషన్స్, సెక్యూరిటీ అనుమతులు రాకపోవటం వల్లే ఈవెంట్ రద్దయినట్లు తెలుస్తుంది.
గుంటూరు కారం సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జయరాం, జగపతిబాబు, సునీల్, తదితరులు నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ని జనవరి 6న జరుగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా రిలీజ్ చేయాలని భావించారు. ఈ సినిమాకు సెన్సార్ నుండి యు / ఏ సెర్టిఫికెట్ వచ్చింది. మూవీ రన్ టైం 159 నిమిషాలు అని తెలుస్తోంది.