హీరో మహేశ్‌బాబుకు కరోనా

Mahesh Babu Tested For Covid-19 Positive. సూపర్ స్టార్ మహేశ్ బాబు కరోనా బారినపడ్డారు. తన‌కు కొవిడ్ పాజిటివ్ వచ్చిందన్న

By Medi Samrat  Published on  6 Jan 2022 3:45 PM GMT
హీరో మహేశ్‌బాబుకు కరోనా

సూపర్ స్టార్ మహేశ్ బాబు కరోనా బారినపడ్డారు. తన‌కు కొవిడ్ పాజిటివ్ వచ్చిందన్న విష‌యాన్ని మహేశ్ బాబు స్వయంగా సోష‌ల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఎన్ని ముందుజాగ్రత్తలు తీసుకున్నా కరోనా సోకిందని, స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నానని తెలిపారు. ప్రస్తుతం వైద్య మార్గదర్శకాలు పాటిస్తూ ఇంటి వద్దే ఐసోలేషన్ లో ఉన్నానని వివరించారు. గత కొన్నిరోజులుగా తనను కలిసినవారందరూ తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని మహేశ్ బాబు విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికీ ఎవ‌రైనా వ్యాక్సిన్ తీసుకోకుండా ఉన్నట్టయితే వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే కరోనా సోకినా గానీ తీవ్ర లక్షణాలు ఉండవని, ఆసుపత్రి పాలయ్యే అవసరాన్ని తగ్గిస్తుందని ప్ర‌క‌ట‌న‌లో రాసుకొచ్చారు. త్వరలోనే కోలుకుని ఆరోగ్యంతో మళ్లీ మీ ముందుకు వస్తాను అంటూ తన ప్రకటనలో వెల్ల‌డించారు.


Next Story
Share it