సూప‌ర్ స్టార్ మ‌హేష్ మంచి మ‌న‌సు.. నమ్రత పోస్టు వైరల్

Mahesh Babu Saves Baby Life. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రీల్ లైఫ్‌లోనే కాదు.. రియ‌ల్ లైఫ్‌లోనూ హీరో అని అనిపించుకుంటున్న

By Medi Samrat  Published on  15 Nov 2020 1:58 PM GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ మంచి మ‌న‌సు.. నమ్రత పోస్టు వైరల్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రీల్ లైఫ్‌లోనే కాదు.. రియ‌ల్ లైఫ్‌లోనూ హీరో అని అనిపించుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చాలా మంది చిన్నారుల‌కు శ‌స్ర్త చికిత్స‌కు సాయం చేసిన మ‌హేష్‌.. తాజాగా మ‌రో చిన్నారి గుండె ఆప‌రేష‌న్‌కు సాయం అందించారు. తన భర్త మరో చిన్నారికి సాయం చేసిన విషయాన్ని నమ్రతా శిరోద్కర్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తెలిపింది.ఒక చిన్న బాబుకు హార్ట్ సర్జరీకి అవసరమైన సాయాన్ని మహేశ్ బాబు అందించార‌ని తెలిపింది. ఆ సర్జరీ విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్ లో జరిగింద‌ని.. 'మై దీపావళి బ్లెస్సింగ్స్' అంటూ సదరు చిన్నారి ఆరోగ్యం ఇప్పుడు బాగుందని చెప్పారు. చిన్నారితో పాటు.. వారి కుటుంబం సంతోషంగా ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంబీఫర్ సేవింగ్స్ హార్ట్ అన్న హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు. దీపావళి పర్వదినాన టపాసులు కాల్చడానికి బదులుగా ఒక మొక్కని నాటితే కాలుష్యాన్ని కాస్తయినా తగ్గించిన వారిమవుతామని చెప్పింది.

ప్ర‌స్తుతం మ‌హేష్‌.. స‌ర్కార్ వారి పాట చిత్రంలో న‌టిస్తున్నారు. క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా ఈ చిత్ర షూటింగ్ నిలిచిపోయింది. ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్‌లు మొద‌లు అవుతుండ‌డంతో... ఈ చిత్ర షూటింగ్‌ను జ‌న‌వ‌రి నుంచి మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పరశురామ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేశ్ నటిస్తోంది.


Next Story