ఈ రెండేళ్లలో చాలా జరిగాయి.. మారాయి.. నాకు బాగా దగ్గరైనోళ్లు దూరమయ్యారంటూ మహేష్ ఎమోషనల్..

Mahesh Babu Emotional Speech. 'సర్కారు వారి పాట' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం నాడు హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా సాగింది

By Medi Samrat  Published on  8 May 2022 3:00 PM IST
ఈ రెండేళ్లలో చాలా జరిగాయి.. మారాయి.. నాకు బాగా దగ్గరైనోళ్లు దూరమయ్యారంటూ మహేష్ ఎమోషనల్..

'సర్కారు వారి పాట' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం నాడు హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా సాగింది. హీరో మహేష్ బాబు తన స్పీచ్ సమయంలో కాస్త ఎమోషనల్ అయ్యారు. చిత్రానికి పని చేసిన పలువురిని ప్రశంసించడమే కాకుండా.. తన లైఫ్ లో చోటు చేసుకున్న కొన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు మహేష్ బాబు. మహేశ్‌ బాబు తన అన్నయ్య రమేశ్‌బాబుని తలచుకొని ఎమోషనల్‌ అయ్యారు. 'ఈ రెండేళ్లలో చాలా జరిగాయి. చాలా మారాయి. నాకు బాగా దగ్గరైనోళ్లు దూరమయ్యారు. కానీ ఏది జరిగినా, ఏది మారినా మీ (ఫ్యాన్స్‌) అభిమానం మాత్రం మారలేదు.. అలానే ఉంది. ఇది చాలు ధైర్యంగా ముందుకెళ్లి పోవడానికి..' అంటూ మహేశ్‌బాబు ఎమోషనల్‌ అయ్యారు.

మహేష్ బాబు ఎందుకంత ఎమోషనల్ అయ్యారని అభిమానులు ఆరా తీస్తూ ఉన్నారు. మహేష్ బాబు తన సోదరుడు రమేష్ బాబు మరణంతో కలత చెందారని తెలుస్తోంది. కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్‌బాబు అన్నయ్య రమేశ్‌ బాబు అనారోగ్యంతో ఈ ఏడాది జనవరి 8న మృతి చెందారు. ఆ సమయంలో మహేశ్‌బాబు కరోనా బారిన పడడంతో చివరి చూపు కూడా నోచుకోలేదు. తన కెరీర్ కు ఎంతో సహకారం అందించిన వారిలో రమేష్ బాబు ఒకరని మహేష్ చెబుతూ ఉంటారు. అందుకే ప్రీరిలీజ్ ఈవెంట్ లో మహేష్ కాస్త ఎమోషనల్ అయ్యారు.

మహేశ్‌బాబు, కీర్తీ సురేష్‌ జంటగా తెరకెక్కిన చిత్రం 'సర్కారువారి పాట'. పరశురాం​ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. మే 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది.












Next Story