'ఆర్ఎక్స్ 100' దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాతక్మంగా తెరకెక్కించిన చిత్రం 'మహా సముద్రం'. శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో అదితి రావు హైదరీ ఒక ముఖ్య పాత్రలో నటించింది. దాదాపు పదేళ్ల తర్వాత సిద్ధార్థ్ తెలుగులో నటించిన సినిమా కావడంతో భారీ అంచనాల నడుమ విడుదల చేశారు. దసరా కానుకగా అక్టోబర్ 14న రిలీజైన మహా సముద్రం డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా మహా సముద్రం సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. పెద్దగా ప్రచారం చేయకుండానే డైరెక్ట్‌గా శనివారం నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
రిలీజ్ సమయంలో రూ.14 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో రంగంలోకి దిగిన మహా సముద్రం సినిమా కేవలం 6.96 కోట్ల షేర్‌ను మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమాకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్ భారీ ధరకే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.11 కోట్లకు ఈ సినిమాను కొనుగోలు చేసినట్లు సమాచారం. తెలుగు, తమిళం భాషల్లో మహా సముద్రం సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. థియేటర్లలో చూడని వాళ్లు ఓటీటీలో చూసేయొచ్చు.