Madhavan Gives Clarity About Ram Movie. ఎనర్జిటిక్ స్టార్ రామ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో కెరీర్ బెస్ట్ కలెక్షన్లు అందుకున్నాడు.
By Medi Samrat Published on 12 Jun 2021 2:56 PM GMT
ఎనర్జిటిక్ స్టార్ రామ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో కెరీర్ బెస్ట్ కలెక్షన్లు అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన రెడ్ సినిమా పర్వాలేదనిపించింది. ఇక తర్వాతి సినిమా విషయంలో పెద్ద పెద్ద స్టార్స్ యాక్ట్ చేసేలా చూస్తున్నాడని ఇటీవలే వార్తలు వచ్చాయి. ముఖ్యంగా మాధవన్ ఈ సినిమాలో నటిస్తూ ఉన్నాడనే వార్తలు వచ్చాయి. మాధవన్ ఇటీవలి కాలంలో నటించిన డైరెక్ట్ తెలుగు సినిమా సవ్య సాచి సినిమానే.. ఈ సినిమా తర్వాత మరే తెలుగు సినిమా లోనూ మాధవన్ నటించలేదు. అయితే రామ్ సినిమాలో మాధవన్ నటిస్తున్నడనే రూమర్ బాగా స్ప్రెడ్ అయింది. ఇంతలో మాధవన్ ఓ క్లారిటీని ఇచ్చారు.
రామ్ ప్రస్తుతం లింగుస్వామి డైరెక్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తుండగా.. మాధవన్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడని వార్తలు వచ్చాయి. దీనిపై మాధవన్ క్లారిటీ ఇచ్చాడు. లింగుస్వామి లాంటి డైరెక్టర్ తో పనిచేయడం చాలా స్పెషల్ అని.. ఆయన అద్బుతమైన వ్యక్తి అని తెలిపారు. దురదృష్టవశాత్తు ఇటీవల సోషల్ మీడియాలో లింగుస్వామి మూవీలో నేను విలన్ గా నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని మాధవన్ వెల్లడించారు. ఈ సినిమాలో ఉప్పెన భామ కృతి శెట్టి రామ్ సరసన నటించబోతోంది.