కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన 'MAD స్క్వేర్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. MAD స్క్వేర్ నిర్మాతలు ముందుగా మార్చి 29న సినిమా విడుదల తేదీని ప్రకటించారు. అయితే సినిమాకు సంబంధించి కీలక మార్పు జరిగింది.
MAD స్క్వేర్ మార్చి 28న వస్తుందని నిర్మాత నాగ వంశీ ధృవీకరించారు. తన అధికారిక X/Twitter హ్యాండిల్‌లో దీనిని ప్రకటించాడు. తేదీ 29 మార్చి అమావాస్య అని.. డిస్ట్రిబ్యూటర్లు వేరే తేదీన రిలీజ్ డేట్ కావాలని కోరారు. అంతేకాకుండా నితిన్ నటించిన రాబిన్‌హుడ్‌తో పోటీ నెలకొంది. అందుకే ఒకరోజు ముందుగా మ్యాడ్ స్క్వేర్ మార్చి 28న విడుదలవుతుందని తెలిపారు.
నాగ వంశీ ట్వీట్ 'హరి హర వీర మల్లు' చిత్రం వాయిదా పడబోతోందని పరోక్షంగా ధృవీకరించినట్లే. హరి హర వీర మల్లు సిబ్బందిని పట్టించుకోకుండా హీరో నితిన్, రాబిన్ హుడ్ సినిమా దర్శకుడు వెంకీ కుడుములకి మాత్రమే కృతజ్ఞతలు తెలిపారు.