రామజోగయ్య శాస్త్రి చేసిన ట్వీట్.. ఇంతకూ ఏమి జరిగింది..?

Lyricist Ramajogaiah Sastry Tweet Goes Viral. ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

By Medi Samrat  Published on  25 Nov 2022 11:26 AM GMT
రామజోగయ్య శాస్త్రి చేసిన ట్వీట్.. ఇంతకూ ఏమి జరిగింది..?

ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇంతకూ ఏమి జరిగిందా అని అందరూ ఆసక్తిగా తెలుసుకోడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డిలోని జై బాలయ్య సాంగ్ రిలీజ్ అయిన కొద్ది సేపటికే ఆయన ఈ ట్వీట్ చేశారు.

"ప్రతి పాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను.. దయచేసి నన్ను గౌరవంగా చూడగలిగిన వారు మాత్రమే నాతో ప్రయాణించగలరు.. అన్నట్టు...జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్ధం నా పేరును సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రి గా మార్చుకున్నాను..ఇందులో ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండవలసిన అవసరం లేదు.. ఉంటే ఇటు రాకండి" అంటూ దండం పెట్టేస్తోన్న ఎమోజీలతో రామజోగయ్య శాస్త్రి ట్వీట్ చేశారు.

నందమూరి బాలకృష్ణ- గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా 'వీరసింహారెడ్డి'. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగల్ 'జై బాలయ్య' పాటను విడుదల చేశారు. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, కరీముల్లా పాడారు. బాలయ్య సరసన శ్రుతిహాసన్ నటిస్తోంది, కన్నడ నటుడు దునియా విజయ్ నెగెటివ్ రోల్ పోషిస్తున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్, కేజీఎఫ్ అవినాశ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. 2023 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Next Story
Share it