నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ

Liquor Bottles were stolen from film Producer Bellamkonda Suresh Car. సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ జరిగింది. గురువారం ఈ ఘటన చోటు చేసుకోగా

By Medi Samrat  Published on  10 Jun 2023 10:14 AM IST
నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ

సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ జరిగింది. గురువారం ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కారు అద్దం పగులగొట్టి కొంత నగదు, ఖరీదైన మద్యం సీసాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం సీసాల విలువ చాలా ఎక్కువగా ఉంటుందని తెలిసింది.

జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలోని బెల్లంకొండ సురేష్ కు సాయిగణేష్ ప్రొడక్షన్స్ పేరుతో కార్యాలయం ఉంది. గురువారం మధ్యాహ్నం సురేష్‌కు చెందిన బెంజ్‌ కారును కార్యాలయం ముందు నిలిపారు. శుక్రవారం ఉదయం చూడగా కారు ఎడమవైపు వెనుక సీటువద్ద అద్దం పగిలి ఉంది. కారు లోపల ఉంచిన రూ.50వేల నగదు, 11 ఖరీదైన మద్యం సీసాలు కనిపించలేదు. మద్యం సీసాల ధర 28వేలు వరకు ఉంటుందని సమాచారం. నగదు, మద్యం సీసాలు చోరీకి గురికావడంతో కార్యాలయం సిబ్బంది, సురేష్ సతీమణి పద్మావతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెల్లంకొండ సురేష్ ఇద్దరు కొడుకులు హీరోలుగా ఉన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవలే ఛత్రపతి సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. చిన్న కొడుకు బెల్లంకొండ గణేష్ నటించిన 'నేను స్టూడెంట్ సర్' థియేటర్లలో సందడి చేస్తూ ఉంది.


Next Story