నటి కుష్బూ ట్విట్టర్ ఖాతా హ్యాక్..!
Kushboo Sundar's Twitter account hacked. కుష్బూ సుందర్.. అటు సినిమాల లోనూ, ఇటు రాజకీయాలలోనూ తన ప్రత్యేకతను
By Medi Samrat Published on 20 July 2021 3:41 PM ISTకుష్బూ సుందర్.. అటు సినిమాల లోనూ, ఇటు రాజకీయాలలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆమెకు హ్యాకర్లు షాక్ ఇచ్చారు. కుష్బూ సుందర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఆమె అకౌంట్ ప్రొఫైల్ నేమ్, కవర్ ఫొటోను హ్యాకర్లు మార్చేశారు. ఒక రాకాసి లాంటి ఫొటోను పెట్టి, ప్రొఫైల్ నేమ్‌ను బ్రియాన్ (Briann) అని మార్చారు. కుష్బూ ట్వీట్లు అన్నీ డిలీట్ అయిపోయాయి.
తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిన విషయాన్ని గుర్తించిన కుష్బూ తన అభిమానులు, ఫాలోయర్స్‌ను అలెర్ట్ చేశారు. తన అకౌంట్ హ్యాక్ అవ్వడం లేదా మూడు వేర్వేరు ప్రాంతాల నుంచి మూడు సార్లు లాగిన్ ట్రై చేసి ఫెయిల్ అవ్వడాన్ని గుర్తించామని ట్విట్టర్ తనకు మెసేజ్ పంపిందంటూ కుష్బూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. రెండ్రోజులుగా తాను ట్విట్టర్ అకౌంట్‌లో లాగిన్ అవ్వలేకపోతున్నానని, పాస్‌వర్డ్ మార్చడం కూడా సాధ్యపడడం లేదని తెలిపారు. ట్విట్టర్ కంపెనీ నుంచి తనకు ఎటువంటి సాయం అందడం లేదని చెప్పారు.
2020 ఏప్రిల్‌లోనూ కుష్బూ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న కుష్బూ మళ్లీ సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అన్నాత్తే సినిమాలో రజినీకాంత్ భార్య గా కుష్బూ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.