నెక్ట్స్‌ సినిమాతో తమిళ్ లోకి ఎంట్రీ ఇస్తున్న కిరణ్ అబ్బవరం

Kiran Abbavarams Bilingual Movie Locks Release Date. తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటున్న యంగ్ హీరోలో

By Medi Samrat  Published on  1 Feb 2022 1:30 PM GMT
నెక్ట్స్‌ సినిమాతో తమిళ్ లోకి ఎంట్రీ ఇస్తున్న కిరణ్ అబ్బవరం

తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటున్న యంగ్ హీరోలో కిరణ్ అబ్బవరం ఒకరు. రాజా వారు-రాణి గారు, ఎస్.ఆర్.కళ్యాణ మండపం సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎస్.ఆర్.కళ్యాణ మండపం సినిమా భారీ కలెక్షన్లను రాబట్టింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న కిరణ్ అబ్బవరం.. మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 'సెబాస్టియన్ పి.సి. 524' సినిమాను ఈ నెలలోనే విడుదల చేయనున్నారు. నిర్మాతలు సెబాస్టియన్ పి.సి. 524 చిత్రాన్ని ఫిబ్రవరి 25న విడుదల చేయాలని భావిస్తున్నారు.

ద్విభాషా చిత్రం కావడంతో 'సెబాస్టియన్ పి.సి. 524' తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ప్రమోషన్స్‌ను ప్రారంభించడానికి మేకర్స్ ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం నైట్ బ్లైండ్ నెస్ తో బాధపడుతున్న పోలీసు పాత్రలో నటించనున్నాడు. 'నాకు రాత్రి అంధత్వం ఉంది, ఎవరికీ చెప్పొద్దు సెబా' అంటూ చిత్ర బృందం పోస్టర్‌ విడుదల చేసింది. ప్రమోద్, రాజు నిర్మించిన ఈ ద్విభాషా యాక్షన్ డ్రామాలో నమ్రత దారేకర్, కోమలి ప్రసాద్ కథానాయికలుగా నటించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆసక్తికరమైన థ్రిల్లర్‌గా రూపొందించబడింది. జిబ్రాన్ సంగీతం అందించారు.


Next Story
Share it