ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న 'కేజీఎఫ్' ఛాప్టర్-2 టీజర్ వచ్చేసింది..!
KGF Chapter2 TEASER. యావత్ భారత సినీ అభిమానలోకం ఎప్పుడెప్పుడా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'కేజీఎఫ్-2' సినిమా
By Medi Samrat Published on 7 Jan 2021 11:37 PM ISTయావత్ భారత సినీ అభిమానలోకం ఎప్పుడెప్పుడా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'కేజీఎఫ్-2' సినిమా టీజర్ విడుదలైంది. మొదటి పార్టుగా వచ్చిన కేజీఎఫ్.. అద్యంతం యాక్షన్ థ్రిల్లర్ గా అలరించింది. దీంతో కేజీఎఫ్-2 సినిమాపై అంచనాలు మాములుగా లేవు. దీంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎంతో శ్రద్దతో రెండో భాగాన్ని తెరకెక్కిస్తున్నాడు. మొదటి పార్టు అభిమానులకు పూనకాలు తెప్పించగా.. తాజాగా రెండో టీజర్ విడుదలై అరుపులు పెట్టిస్తుంది. శుక్రవారం యశ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం రాత్రి ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది.
మొదటి పార్టును మించి ఆలరించేలా రూపొందించిన ఈ టీజర్.. ఛాప్టర్-2పై ఉన్న అంచనాలను మరింత పెంచేస్తున్నది. హీరో యాష్‌ను ప్రజెంట్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. ఇక బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ ఈ సినిమాలో విలన్ అధీరగా ప్రేక్షకుల ముంగిట్లోకి వస్తున్నారు. తొలి కేజీఎఫ్ సినిమాలో అధీరాను చూపకపోవడం గమనార్హం. కేవలం సింహపు ఉంగరం ధరించిన వ్యక్తిని.. ఆయన ముఖం కనిపించకుండా చూపారు. దీంతో ఆ పాత్ర ఎవరు చేస్తారన్న విషయమై సినీ ప్రేమికుల్లో ఆసక్తి నెలకొంది. అధీర పాత్రను సంజయ్‌దత్ చేస్తారని ప్రకటించగానే మరింత ఆసక్తి పెరిగింది.
అంతేకాకుండా ఇంకా ఈ సినిమాలో రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ తదితరులు నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. కేజీఎఫ్ పార్టు-1లోని పలు ప్రశ్నలకు లభించని సమాధానాలు రెండో భాగంలో లభిస్తాయని భావిస్తున్నారు. ఇక ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతున్నది. కరోనా కారణంగా థియేటర్లలో సందడి దూరమైన వేళ.. ఈ సినిమా త్వరలోనే విడుదలై థియేటర్లకు పాత కళను తీసుకొస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.