పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ 'K.G.F: చాప్టర్ 2' ఓటీటీలోకి వచ్చేసింది. ఓ వైపు థియటర్ కు రిపీట్ ఆడియన్స్ వెళుతుండగా.. Amazon Prime వీడియో ఓటీటీలోకి సినిమాను తీసుకుని వచ్చేసింది. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో అకౌంట్ ఉంటే సరిపోదు.. ముందుగా చూడాలంటే రెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. 'K.G.F' ఫ్రాంచైజీ అభిమానులు, ప్రైమ్ వీడియోలో మూవీ రెంటల్ ద్వారా సినిమాను చూడవచ్చు. ప్రైమ్ మెంబర్‌లు, ప్రైమ్ మెంబర్‌లు కాని వారు సినిమాని రూ. 199కి అద్దెకు తీసుకోవచ్చు. ఈ పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్‌ను తమ ఇళ్లల్లోనే ఎంజాయ్ చేయవచ్చు. ఈ చిత్రం కన్నడ, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో అద్దెకు అందుబాటులో ఉంటుంది. 'K.G.F: Chapter 2'తో పాటుగా.. లేటెస్ట్ భారతీయ, అంతర్జాతీయ చలనచిత్రాలను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ చలనచిత్రాలను కూడా అద్దెకు తీసుకోవచ్చు.
ప్రైమ్ వీడియోలో మూవీ రెంటల్స్‌ను ప్రారంభించారు. ఓటీటీలో అందరికీ అందుబాటులోకి వచ్చే కంటే ముందే రెంటల్ విభాగంలో సినిమాను చూడవచ్చు. భారతదేశంలోని కస్టమర్‌లకు ఇంటి వద్ద, థియేటర్ లాంటి అనుభూతి పొందడానికి ముందస్తు యాక్సెస్‌ను అందిస్తుంది. ప్లేబ్యాక్ ప్రారంభించిన తర్వాత సినిమాను పూర్తి చేయడానికి కస్టమర్‌లు 48 గంటల సమయాన్ని పొందుతారు. లావాదేవీ తేదీ నుండి 30 రోజులలోపు కస్టమర్‌లు సినిమా చూడాల్సి ఉంటుంది.