జానీ మాస్టర్ బెయిల్ రద్దుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మైనర్ పై లైంగిక దాడికి పాల్పడ్డారన్న అభియోగాలు నమోదవ్వడం తెలుగు సినిమా ఇండస్ట్రీని కుదుపులకు గురిచేసింది.

By Medi Samrat  Published on  23 Nov 2024 10:16 AM IST
జానీ మాస్టర్ బెయిల్ రద్దుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మైనర్ పై లైంగిక దాడికి పాల్పడ్డారన్న అభియోగాలు నమోదవ్వడం తెలుగు సినిమా ఇండస్ట్రీని కుదుపులకు గురిచేసింది. ఈ కేసులో అరెస్టై జైల్లో ఉన్న జానీకి తెలంగాణహైకోర్టు అక్టోబర్‌ 24వ తేదీన బెయిల్‌ మంజూరు చేసింది. ఆ బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఫిర్యాదుదారు సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిని పరిశీలించిన జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ సతీష్‌చంద్ర మిశ్రాలతో కూడిన ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని చెబుతూ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది.

జానీ మాస్టర్‌ ఇటీవల రాకింగ్ రాకేష్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు చిత్రం కేశవ చంద్ర రమావత్ (కెసిఆర్) ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మొదటిసారి బహిరంగంగా కనిపించారు. జానీ మాస్టర్ ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించారు. జైల్లో ఉన్న సమయంలో తనకు అండగా నిలిచినందుకు జానీ భార్యకు కృతజ్ఞతలు తెలిపారు. "భార్య ఎల్లప్పుడూ తన భర్తకు ఖచ్చితంగా అండగా నిలుస్తుంది. ఆమె శక్తి, బలం ఎల్లప్పుడూ అతనికి మద్దతు ఇస్తుంది. ఆ విషయాన్ని బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇటీవల నా విషయంలో కొన్ని విషయాలు జరిగాయి, ఆ సమయంలో నా భార్య నాకు అండగా నిలిచినందుకు నిజంగా ధన్యవాదాలు." అని అన్నారు.

Next Story