హాట్ బ్యూటీ సన్నీలియోన్ పై చీటింగ్ కేసు..

Kerala Police Questions Sunny Leone In Alleged Cheating Case. బాలీవుడ్ హాట్ బ్యూటీ, నటి సన్నీ లియోన్ మరోసారి వార్తల్లో, తాజాగా ఈ హాట్ బ్యూటీపై కేరళాలో చీటింగ్ కేసు నమోదు అయ్యింది.

By Medi Samrat  Published on  7 Feb 2021 3:40 AM GMT
Sunny Leone In Alleged Cheating Case

బాలీవుడ్ హాట్ బ్యూటీ, నటి సన్నీ లియోన్ మరోసారి వార్తల్లో నిలిచింది. హాలీవుడ్ లో ఒకప్పుడు ఫోర్న్ చిత్రాల్లో నటించి ఈ హాట్ బ్యూటీ తర్వాత బాలీవుడ్ బిగ్ బాస్ లో నటించి వెండి తెరపై చోటు దక్కించుకుంది. ఆ తర్వాత శృంగారభరిత చిత్రాల్లో నటిస్తూ వచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మళియాళ భాషల్లో ఐటమ్ సాంగ్స్ లో నటించింది. తాజాగా ఈ హాట్ బ్యూటీపై కేరళాలో చీటింగ్ కేసు నమోదు అయ్యింది. చీటింగ్ కేసు నేపథ్యంలో ఆమెను కేరళ పోలీసులు విచారిస్తున్నారు.

గత ఏడాది ప్రేమికుల రోజు (వాలెంటైన్ డేస్) సందర్భంగా తాను చేయనున్న ఫంక్షన్‌కు వచ్చేందుకు రూ.29లక్షలు తీసుకున్నారని, కానీ ఫంక్షన్‌కు హాజరుకాకుండా మోసం చేశారంటూ పెరుంభవూర్‌కు చెందిన ఆర్ షియాస్ అనే వ్యక్తి కేసు నమోదు చేశారు. ఇక సన్నీపై కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సన్ని లియోన్‌ను విచారణ నిమిత్తం కేరళకు పిలిపించారు.

అయితే ఆ ఫంక్షన్‌ అనేక సార్లు వాయిదా వేశారని, ఆ తరువాత కరోనా కారణంగా తాను హాజరు కాలేక పోయానని సన్నీ తెలిపారు. అంతే కాదు ఫంక్షన్ కి హాజరు కావడానికి మొదలే ఒప్పందం చేసుకున్నారని.. దాని ప్రకారం తనకు రూ.12.5లక్షలు ఇస్తానని అతడు చెప్పాడని, కానీ అతడు ఇవ్వలేదని సన్నీ తెలిపారని పోలీస్ అధికారి చెప్పారు. గత ఏడాది కరోనా కారణంగా పలుమార్లు ఈ ఫంక్షన్ వాయిదా పడుతూ రావడంతో తన షెడ్యూల్స్‌ సరిచూసుకోలేకపోయానని అన్నారు. ఈ సమయంలోనే ఫంక్షన్‌కు తాను రాలేనని సన్నీ ట్వీట్ చేసినట్లు చెప్పారు. కానీ షేయాస్ మాత్రం ఎఫ్ఐఆర్‌లో సన్నీ లియోన్ కావాలనే ఫంక్షన్‌కు హాజరు కాలేదని అన్నారు.


Next Story
Share it