ప్రతిసారీ అడగకండి: కీర్తి సురేష్ చిర్రుబుర్రు

Keerthy Suresh opens up about her marriage at the Maamannan audio launch. నటి కీర్తి సురేష్ కు పెళ్లి ఫిక్స్ అయ్యిందంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on  3 Jun 2023 3:15 PM IST
ప్రతిసారీ అడగకండి: కీర్తి సురేష్ చిర్రుబుర్రు

నటి కీర్తి సురేష్ కు పెళ్లి ఫిక్స్ అయ్యిందంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే..! ఈ విషయంపై కీర్తి సురేష్ ను సంప్రదిస్తే మాత్రం ఊహించని సమాధానం వచ్చింది. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా? అని తాజాగా ఓ యాంకర్ ప్రశ్నించగా.. దీనిపై కీర్తి సురేష్ కు కోపం వచ్చింది. ‘‘ నా పెళ్లికి సంబంధించిన వస్తున్న వార్తలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చా. మీరంతా వివాహం గురించే ఎందుకు అడుగుతున్నారు. నా పెళ్లిపై మీరెందుకు అంత ఆసక్తి చూపుతున్నారు. నా వెడ్డింగ్‌ను ప్లాన్ చేసుకున్నాక స్వయంగా నేనే చెప్తా. దీని గురించి ప్రతిసారి అడగాల్సిన అవసరం లేదు. ప్రతి ప్రెస్‌మీట్‌లో ప్రశ్నించాల్సిన అవసరం లేదు’’ అంటూ కొంచెం ఘాటుగానే బదులు ఇచ్చింది.

కొద్దిరోజుల కిందట కీర్తి సురేష్ తండ్రి సైతం ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశారు.‘‘నా కుమార్తె కీర్తి సురేష్ ఒక అబ్బాయితో డేటింగ్‌లో ఉందని, ఆమె అతనితో పెళ్లి చేసుకోబోతోందని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. అవన్నీ ఫేక్ న్యూస్." అని చెప్పుకొచ్చారు. అతడు మా సన్నిహిత కుటుంబ స్నేహితుడు. ఫర్హాన్ పుట్టినరోజున, కీర్తి కొన్ని ఫోటోగ్రాఫ్‌లను పోస్ట్ చేసింది. వాటిని ఒక తమిళ ఆన్‌లైన్ మ్యాగజైన్ ప్రచురించడంతో ఆమె పెళ్ళికి సంబంధించిన వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో కీర్తి తండ్రి వివరణ ఇవ్వాల్చి వచ్చింది. కీర్తి పెళ్లి ఫిక్స్ అయితే మీడియాకు, ప్రజలకు ముందుగా తెలియజేస్తామని అన్నారు. అసత్యాలు, తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని కోరారు. ఇలాంటి తప్పుడు వార్తలు వైరల్ చేయడం కారణంగా కుటుంబంలో మనఃశాంతి కరువవుతుందని చెప్పుకొచ్చారు.

Next Story