నితిన్ మీద పగ పట్టిన కీర్తి సురేష్

Keerthi Suresh Funny Comments On Nithin. కీర్తి సురేష్.. తనకంటూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. మహానటి సినిమా

By Medi Samrat  Published on  1 Dec 2020 12:42 PM IST
నితిన్ మీద పగ పట్టిన కీర్తి సురేష్

కీర్తి సురేష్.. తనకంటూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. మహానటి సినిమా ద్వారా గొప్ప పేరును సంపాదించుకున్న కీర్తి వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతోంది. మహానటి తర్వాత కీర్తి సురేష్ కు చెప్పుకోదగ్గ హిట్స్ దక్కలేదు. కనీసం జనాలకు నచ్చే విధంగా కూడా ఆ సినిమాలు లేవు. ఇక ఆమె లేడీ ఓరియెంట్ సినిమాలకు దూరమయితే బెటర్ అనుకుంటోందని కథనాలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నితిన్ సరసన 'రంగ్ దే' సినిమాలో నటిస్తోంది కీర్తి సురేష్. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటన కారణంగా హీరో నితిన్ మీద పగబట్టానని అంటోంది కీర్తి సురేష్. ఇంతకూ నితిన్ చేసిన తప్పు ఏమిటో తెలుసా..?



కీర్తి సురేష్ నిద్రపోతూ ఉండగా ఫోటో తీయడమే..! వెంకీ అట్లూరి తెర‌కెక్కిస్తున్న రంగ్ దే చిత్రం ప్ర‌స్తుతం దుబాయ్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇటీవ‌ల షూటింగ్ లొకేష‌న్‌కు సంబంధించిన ఫొటో షేర్ చేశాడు నితిన్. షూట్ బ్రేక్‌లో కీర్తి నిద్ర పోతుంటే ఆ పిక్ తీశారు..! మేము చెమ‌ట‌లు కారుస్తుంటే కీర్తి హ్యాపీగా రిలాక్స్ అవుతుంది అనే కామెంట్ పెట్టడంతో.. కీర్తి సురేష్ స్పందించింది.. ఇక షూటింగ్ మధ్యలో ఎప్పుడూ నిద్రపోకూడదనే పాఠం నేర్చుకున్నా అంటూ త‌న పోస్ట్‌లో తెలిపింది. నేను త‌ప్ప‌కుండా రివేంజ్ తీర్చుకుంటాను అంటూ నితిన్ ను ఉద్దేశించి చెప్పుకొచ్చింది కీర్తి.




Next Story