తుది శ్వాస విడిచిన కత్తి మహేష్

Kathi Mahesh Passed Away. టాలీవుడ్ రివ్యూ రైటర్, నటుడు కత్తి మహేష్ తుది శ్వాస విడిచారు. నెల్లూరులో రోడ్డు

By Medi Samrat  Published on  10 July 2021 6:00 PM IST
తుది శ్వాస విడిచిన కత్తి మహేష్

టాలీవుడ్ రివ్యూ రైటర్, నటుడు కత్తి మహేష్ తుది శ్వాస విడిచారు. నెల్లూరులో రోడ్డు ప్రమాదంలో గాయపడిన కత్తి మహేష్ గత కొద్దిరోజులుగా చెన్నైలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. అపోలో ఆసుపత్రిలో ఆయన కోలుకుంటున్నారనే వార్తలు కూడా ఇటీవల వచ్చాయి. కానీ కత్తి మహేష్ నేడు మరణించారనే షాకింగ్ న్యూస్ వచ్చింది. యాక్సిడెంట్‌కు గురైన కత్తి మహేష్ చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జులై 10న ఈయన ఆరోగ్యం విషమించి కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు.

కత్తి మహేష్ అటు నటుడుగా కొనసాగుతూ.. మరో వైపు ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచాడు. నెల్లూరు జిల్లా వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన కత్తి మహేష్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. మెరుగైన చికిత్స కోసం మహేష్ ను సన్నిహితులు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ కంటికి ఆపరేషన్ నిర్వహించారు. ఆయన కోలుకుంటున్నాడంటూ ఆయన మిత్రులు మీడియాకు సమాచారం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం కత్తి మహేష్ చికిత్స కోసం రూ 17 లక్షలు కూడా మంజూరు చేసింది. అప్పటి నుండి అపోలోలో చికిత్స పొందుతున్న కత్తి మహేష్ నేడు తుది శ్వాస విడిచారనే వార్తను ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.


Next Story