ఏంటీ.. ఇతను మా కార్తీనేనా..?
Karthi New Look. యుగానికి ఒక్కడు, ఊపిరి, కాష్మోరా, ఖాకీ, ఖైదీ వంటి చిత్రాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులను
By Medi Samrat Published on 17 Dec 2020 10:17 AM IST
యుగానికి ఒక్కడు, ఊపిరి, కాష్మోరా, ఖాకీ, ఖైదీ వంటి చిత్రాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించాడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ. గతేడాది ఖైదీ మూవీతో బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని ఆడియెన్స్ కు అందించాడు. కార్తీ పేరు వినగానే అభిమానులతోపాటు ప్రేక్షకులకూ మదిలో అతని స్మైలింగ్ ఫేసే మెదులుతుంది. హ్యాండ్సమ్ లుక్ తో అతను నవ్వే నవ్వుకు చాలా మంది ఫిదా అయిపోతారు. ఈ హీరో ఇపుడు సరికొత్త లుక్ లో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు.
Omg Is This Our Charming @Karthi_Offl #Karthi #Karthi22 #Latest #Suriya #Suriya40 #Thalapathy #SooraraiPottru pic.twitter.com/NVfM96TQN3
— Tamil Focus (@TamilFocusOff) December 15, 2020
కార్తీ న్యూలుక్ కు సంబంధించిన రెండు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెరిసిన గడ్డం.. బ్రౌన్ కలర్ లాంగ్ హెయిర్ తో 50 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తున్నాడు కార్తీ. తన సోదరుడు సూర్య హీరోగా నిర్మిస్తోన్న కొత్త చిత్రం లాంఛ్ లో కార్తీ ఇలా కనిపించి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఇదేదైనా సినిమాకు సబంధించిన లుక్ అయి ఉంటుందా? అనే చర్చ సాగుతోంది. కార్తి ప్రస్తుతం తంబి (తెలుగులో దొంగ) చిత్రంలో నటిస్తుండగా..విడుదలకు ముస్తాబవుతోంది. కార్తీ, మణిరత్నం డైరెక్షన్ లో చేయనున్న చిత్రం జనవరి నుంచి మొదలుపెట్టనుంది. బక్కియరాజ్ కన్నన్ డైరెక్షన్ లో సుల్తాన్ సినిమా కూడా చేస్తున్నాడు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది.