ఆ ఛానళ్ల పై కరాటే కళ్యాణి ఫిర్యాదు

Karate Kalyani Complaints Against Youtube Channels. ఇటీవలి కాలంలో కరాటే కళ్యాణి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

By Medi Samrat
Published on : 27 May 2022 6:00 PM IST

ఆ ఛానళ్ల పై కరాటే కళ్యాణి ఫిర్యాదు

ఇటీవలి కాలంలో కరాటే కళ్యాణి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే..! తాజాగా ఆమె అసభ్యకర ప్రాంక్ కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తున్న 20 యూట్యూబ్ ఛానళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసభ్యకర కంటెంట్ ఉన్న ఫ్రాంక్ యూట్యూబ్ ఛానల్స్ పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఆమె ఫిర్యాదు చేసిన వాటిలో శ్రీకాంత్ రెడ్డి నడిపే అసభ్యకర యూ ట్యూబ్ ఛానెల్ ఫ్రాంక్ పోరీలూ, గల్లి బాయ్ వంటివి ఉన్నాయి.

ఫ్రాంక్ లు చేసే శ్రీకాంత్ రెడ్డి తో గొడవపడిన ఆమె అతని గురించి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మహిళలను కించపరుస్తూ అసభ్యకర వీడియోలు చేస్తే సహించేది లేదనిచెప్పిన ఆమె ఈ రోజు హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్ లో మరికొన్ని అసభ్యకర ఫ్రాంక్ యూట్యూబ్ ఛానల్ పై ఫిర్యాదు చేసింది. సాక్ష్యాలతో సహా ఆమె పోలీసులకు అసభ్యకర ఫ్రాంక్ యూట్యూబ్ ఛానల్స్ వివరాలు అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. అసభ్యకర ఫ్రాంక్ యూట్యూబ్ ఛానల్స్ పై ఐటీ యాక్ట్ లోని 67A, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.










Next Story