కమల్ సార్.. త్వరగా కోలుకోండి

Kamal Haasan tests positive for COVID-19. మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ సోమవారం మాట్లాడుతూ తనకు

By Medi Samrat  Published on  22 Nov 2021 11:23 AM GMT
కమల్ సార్.. త్వరగా కోలుకోండి

మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ సోమవారం మాట్లాడుతూ తనకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలిందని, ఆసుపత్రిలో చేరానని తెలిపారు. "నేను USA నుండి తిరిగి వచ్చిన తర్వాత నాకు తేలికపాటి దగ్గు వచ్చింది. పరీక్షించినప్పుడు, కరోనావైరస్ ఇన్ఫెక్షన్ అని నిర్ధారించబడింది. ఆసుపత్రిలో ఐసోలేషన్ లో ఉన్నారు. COVID-19 వ్యాప్తి క్షీణించలేదని గ్రహించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి" అని కమల్ హాసన్ ట్వీట్ లో తెలిపారు.

67 ఏళ్ల కమల్ హాసన్ ఇటీవల తన ఫ్యాషన్ బ్రాండ్ 'హౌస్ ఆఫ్ ఖద్దర్‌' ని ప్రారంభించేందుకు అమెరికా వెళ్లారు. చికాగోలో గత వారం ఈ ఈవెంట్ జరిగింది. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కమల్ హాసన్ వారాంతపు ఎపిసోడ్‌లను హోస్ట్ చేయడానికి తమిళ బిగ్ బాస్ సెట్‌లకు కూడా వెళ్లారు. ఈ ఎపిసోడ్‌లలో కమల్ హౌస్‌లోని కంటెస్టెంట్స్‌తో మరియు స్టూడియోలోని ప్రేక్షకులతో చాలా ఉత్సాహంగా కనిపించారు. ఆయనలో ఎలాంటి అనారోగ్య సంకేతాలు కనిపించలేదు.

Advertisement

నవంబర్ 7న పుట్టినరోజు జరుపుకున్న కమల్ ఇప్పటికే కోవిడ్-19కి వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. భారతదేశంలో వైరస్ వ్యాప్తి చెందిన తర్వాత కమల్ హాసన్‌కు ఈ వైరస్ సోకడం ఇదే తొలిసారి. వైరస్ బారిన పడే ముందు, కమల్ తన రాబోయే చిత్రం విక్రమ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దీనికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రను పోషించడమే కాకుండా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్ మరియు విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారు. కమల్ హాసన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తూ ఉన్నారు.


Next Story
Share it