భయపెడుతోన్న ఆది 'జంగిల్' టీజర్
Jungle Telugu Teaser. హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న కథానాయకుడు ఆది సాయికుమార్
By Medi Samrat Published on 12 Dec 2020 11:12 AM IST
హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న కథానాయకుడు ఆది సాయికుమార్. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం జంగిల్. హారర్ జోనర్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి కార్తీక్-విఘ్నేష్ దర్శకత్వం వహిస్తున్నారు. రణవీర్ కుమార్ సమర్పణలో న్యూ ఏజ్ సినిమా మరియు ఆరా సినిమాస్ బ్యానర్స్ పై మహేశ్ గోవిందరాజ్ - అర్చనా చందా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది సరసన వేదిక నటిస్తోంది. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 'చీకటిగా ఓ ఇల్లు ఆ ఇంటి నిండా అస్థిపంజరాలు.. దీపం కాంతిలో వాటిని చూస్తూ షాకవుతున్న హీరో ఆది, హీరోయిన్ వేదిక' ఇదే జంగిల్ ఫస్ట్ లుక్. ఈ ఫస్ట్ లుక్ ఎలా అయితే భయపెట్టిందో.. తాజాగా విడుదలైన చిత్ర టీజర్ కూడా అంతే భయపెడుతోంది.
కారకుడు ఎరైనాడు.. కన్నతల్లి కాలాంతకురాలైంది.. సురుడు శవమైనాడు.. శవాన్ని పీక్కుతిన్నవాడు గాలిలో కలిసి దిక్కులలో వ్యాపించి చర్మం చీల్చి ఉసురు తీసి.. వీడు రక్కసుడు'' అనే వాయిస్ ఓవర్ తో ఉన్న ఈ టీజర్ ఆధ్యంతం ఆకట్టుకునేలా ఉంది. జోస్ ఫ్రాంక్లిన్ అందించిన నేపథ్య సంగీతం భయం కలిగించేలా ఉంది. ఇక గౌతమ్ జార్జ్ అందించిన విజువల్స్ బాగున్నాయి. ఇందులో హీరో హీరోయిన్లతో పాటు ఇతర నటులు భయపడుతూ కనిపిస్తూ చూసే వారిని కూడా భయపడేలా టీజర్ కట్ చేశారు.