మొట్టమొదటిసారి ఆ పని చేస్తున్న ఎన్టీఆర్..?

Jr NTR decides to invest money for the talk show. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇదివరకే బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 1కి వ్యాఖ్యాత

By Medi Samrat  Published on  17 Dec 2020 11:58 AM GMT
మొట్టమొదటిసారి ఆ పని చేస్తున్న ఎన్టీఆర్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇదివరకే బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 1కి వ్యాఖ్యాతగా ఎంతో అద్భుతంగా నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. అయితే బిగ్ బాస్ తరువాత మరి ఎటువంటి బుల్లితెర కార్యక్రమాలు చేయకుండా సినిమాలలో బిజీగా ఉన్న ఎన్టీఆర్ మరొకసారి బుల్లితెరపై కనిపించనున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎంతో బిజీగా గడుపుతున్న తారక్ ఆ సినిమా మధ్యలో దొరికే గ్యాప్ లో ఈ బుల్లితెర కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే జెమినీ టీవీలో ఒక టాక్ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది.

ఎన్టీఆర్ చేయబోయే బుల్లితెర కార్యక్రమం మీలో ఎవరు కోటీశ్వరుడు లాగా ఉంటుందని సమాచారం. అయితే ఇప్పటికే ఈ షోకి సంబంధించిన స్క్రిప్ట్ కూడా తయారయిందని చెప్పవచ్చు. అయితే ఎన్టీఆర్ ఈ షో చేయడానికి ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదు. కానీ ఎన్టీఆర్ తానే ఈ షో కి నిర్మాతగా వ్యవహరించి ఈ టాక్ షోను చేయబోతున్నారు. దాదాపు అరవై ఎపిసోడ్లో సాగే ఈ షో కి ఎన్టీఆర్ భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం వచ్చినప్పటికీ, ప్రస్తుతం మాత్రం ఈ షోకు తానే నిర్మాతగా మారాడని తెలుస్తోంది.

ఎన్టీఆర్ స్వయంగా ఈ టాక్ షో కు నిర్మాతగా మారి, తానే హోస్ట్ గా నిర్వహిస్తుండడంతో ఈ టాక్ షో కు మంచి స్పందన ఉంటుందని ఎన్టీఆర్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇది తెలుసుకున్న అభిమానులు తమ అభిమాన నటుడిని మరొకసారి బుల్లితెరపై చూడవచ్చని ఎంతో ఆనంద పడుతున్నారు. అయితే ఈ షో ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న విషయం గురించి తెలియడం లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ ఈ సినిమా పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ రెండు సినిమాల గ్యాప్ లో ఈ బుల్లితెర కార్యక్రమం చేయనున్నారని తెలుస్తోంది.
Next Story