మంచు విష్ణు సినిమాకు అభ్యంతరాలు

Jinnah Movie Takes a Controversial. టాలీవుడ్ నటుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు 'జిన్నా' అనే చిత్రంలో నటిస్తుండడం తెలిసిందే.

By Medi Samrat  Published on  12 Jun 2022 10:19 PM IST
మంచు విష్ణు సినిమాకు అభ్యంతరాలు

టాలీవుడ్ నటుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు 'జిన్నా' అనే చిత్రంలో నటిస్తుండడం తెలిసిందే. గాలి నాగేశ్వరరావు అనే క్యారెక్టర్‌ను మంచు విష్ణు చేస్తున్నారు. ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 24ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, అవ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. కోన వెంకట్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. 'మంచు విష్ణు పాత్ర కొత్త పంథాలో ఉంటుంది. గాలి నాగేశ్వరరావుగా ఆయన నటన ప్రధానాకర్షణగా నిలుస్తుంది. ఆయన కెరీర్‌లో విభిన్న చిత్రంగా నిలిచిపోతుంది' అని చిత్రబృందం తెలిపింది. పాయల్‌రాజ్‌పుత్‌, సన్నీలియోన్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అనూప్‌రూబెన్స్‌ ఇస్తున్నారు.

ఈ సినిమా టైటిల్ పై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 'జిన్నా' అనే టైటిల్ తొలగించాలంటూ బీజేపీ పేర్కొంది. ఈ సినిమా టైటిల్ ను తిరుమల ఏడుకొండల నేపథ్యంలో ప్రకటించడం కూడా బీజేపీని ఆగ్రహానికి గురిచేసింది. జిన్నా ఓ దేశద్రోహి అని, ఆ పేరుతో సినిమా తీయడమేంటని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ ప్రశ్నించారు. మంచు విష్ణు చరిత్ర తెలుసుకోవాలని.. జిన్నా కారణంగా ఎంతోమంది హిందువులు మానప్రాణాలు కోల్పోయారని అన్నారు. వారి గురించి మంచు విష్ణు తెలుసుకోవాలని కోరారు.














Next Story