ఇండియన్ ఐడల్ ఫినాలేలో షణ్ముఖ ప్రియకు నిరాశే

Indian Idol 12 grand finale highlights. ఇండియన్ ఐడల్ లో గత సీజన్లలో తెలుగు సింగర్స్ సత్తా చాటిన సంగతి తెలిసిందే..!

By Medi Samrat  Published on  16 Aug 2021 7:30 AM GMT
ఇండియన్ ఐడల్ ఫినాలేలో షణ్ముఖ ప్రియకు నిరాశే

ఇండియన్ ఐడల్ లో గత సీజన్లలో తెలుగు సింగర్స్ సత్తా చాటిన సంగతి తెలిసిందే..! ఈసారి కూడా షణ్ముఖ ప్రియ మొదటి నుండి మంచి పాపులారిటీని సంపాదించుకుంటూ వచ్చింది. ఇక ఆదివారం జరిగిన ఫినాలేలో షణ్ముఖ ప్రియ అదృష్టం కలిసి రాలేదు. షణ్ముఖప్రియకు ఆరో స్థానం లభించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు నిరాశకు గురయ్యారు. ఈ నిర్ణయంపై దక్షిణాదిలో ప్రేక్షకులు, సంగీత అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఫినాలే జరుగుతుండగా షణ్ముఖప్రియకు విషెస్ తెలియజేయడమే కాకుండా తన సినిమాలో పాటను పాడే అవకాశం కూడా ఇచ్చాడు.

ఇండియన్ ఐడల్ 12 ఫినాలేలో ఆరుగురు కంటెస్టెంట్లతోపాటు ఉదిత్ నారాయణ్, అల్కా యాగ్నిక్, సుఖ్విందర్ సింగ్, కుమార్ సాను తదితరులు వేదికపై పాటలు పాడి ఉర్పూతలూగించారు. ఈ షోలో ఉత్తరాఖండ్‌కు చెందిన పవన్‌దీప్ రాజన్ విజేతగా నిలిచారు.విజేతకు ప్రకటించిన 25 లక్షల రూపాయల చెక్‌ను సోని లివ్ నిర్వాహకులు చెక్ అందజేశారు. అలాగే మారుతీ కంపెనీ నుంచి పవన్ దీప్‌కు బ్రాండ్ న్యూ స్విఫ్ట్ కారును బహుకరించారు. రెండో స్థానంలో అరుణిత కంజిలాల్, సయాలీ కాంబ్లే మూడోస్థానంలో నిలిచారు. నాలుగో స్థానంలో మహ్మద్ డానిష్, నిహాల్ టారో ఐదోస్థానంలో నిలువగా, షణ్ముఖప్రియ ఆరోస్థానంలో నిలిచారు. అరుణిత, సయాలీ కాంబ్లీకి చెరో 5 లక్షల రూపాయల పారితోషికం లభించింది. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచిన డానిష్, నిహాల్ టారోకు చెరో మూడు లక్షల రూపాయల పారితోషికం లభించింది.


Next Story
Share it