రోడ్ జర్నీ కాన్సెప్ట్ తో `ఇదే మా కథ `.. న‌లుగురి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లు

Idhe Maa Katha First Look Poster Release. యంగ్ హీరో సుమంత్ అశ్విన్‌, శ్రీకాంత్‌, భూమిక‌, తాన్యా హోప్ ప్ర‌ధాన పాత్ర‌లలో

By Medi Samrat  Published on  20 Nov 2020 7:54 AM GMT
రోడ్ జర్నీ కాన్సెప్ట్ తో `ఇదే మా కథ `.. న‌లుగురి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లు

యంగ్ హీరో సుమంత్ అశ్విన్‌, శ్రీకాంత్‌, భూమిక‌, తాన్యా హోప్ ప్ర‌ధాన పాత్ర‌లలో న‌టిస్తున్న చిత్రం ఇదే మా క‌థ‌. రోడ్ జ‌ర్నీ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి గురుప‌వ‌న్ ద‌ర్వ‌కుడు. ఎన్‌. సుబ్రహ్మణ్యం ఆశీస్సులతో మనోరమ గురప్ప సమర్పణలో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్‌ పతాకంపై జి.మహేష్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తుండ‌గా.. సప్తగిరి, సమీర్, సత్యం రాజేష్, శ్రీజిత ఘోష్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. హైద‌రాబాద్ లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఈ సినిమాకు సంబంధించిన నలుగురి పాత్ర‌ల పోస్ట‌ర్లు విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్. అడ్వెంచ‌ర్ రైడ‌ర్ గా సుమంత్ అశ్విన్‌, రైడ‌ర్ మ‌హేంద్ర‌గా శ్రీకాంత్‌, రైడ‌ర్ ల‌క్ష్మిగా భూమిక‌, యాంగ్రీ బ‌ర్డ్ రైడ‌ర్ మేఘ‌నాగా తాన్యా హోప్ బుల్లెట్ పై వివిధ లొకేష‌న్ల బ్యాక్ డ్రాప్ లో ఉన్న ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లు సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నాయి.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు గురుపవన్ మాట్లాడుతూ.. లాక్ డౌన్ కి ముందే షూటింగ్ స్టార్ట్ చేసి లడఖ్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ఈ సినిమా లాక్‌డౌన్ స‌మ‌యంలో అంద‌రిలాగే మా టీమ్ కూడా కొంత నిరాశ‌కు గుర‌య్యాం. అయితే మళ్లీ సాధార‌ణ పరిస్థితులు నెల‌కోవ‌డంతో అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ హైద‌రాబాద్ షెడ్యూల్ పూర్తిచేశాం. ఇంకా మ‌నాలి షెడ్యూల్ బ్యాలెన్స్ ఉంది. డిసెంబ‌ర్‌లో షూటింగ్ పూర్తిచేస్తాం ఇది రైడ‌ర్స్ స్టోరి త‌ప్ప‌కుండా న‌చ్చుతుందని అన్నారు.

హీరో సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ.. ఇలాంటి డిఫిక‌ల్ట్ టైమ్‌లో కూడా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ షూటింగ్‌ని ఆర్గ‌నైజ్ చేస్తున్న నిర్మాత మ‌హేష్ గారికి కృత‌జ్ఞ‌త‌లు. శ్రీ‌కాంత్ గారు‌, భూమిక లాంటి ఎక్స్‌పీరియ‌న్డ్స్ యాక్ట‌ర్స్‌తో న‌టించ‌డం ఒక వండ‌ర్‌ఫుల్ ఎక్స్‌పీరియ‌న్స్ అని చెప్పారు.

హీరో శ్రీ‌కాంత్ మాట్లాడుతూ.. నాకు బైక్ రెడింగ్ అంటే చాలా ఇష్టం. చిన్న‌ప్పుడు చాలా సార్లు రైడింగ్‌కి వెళ్లాను. అలాగే ఒక సారి హైద‌రాబాద్ నుండి ల‌డ‌క్ కార్‌లో వెళ్లాను. చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ మంచి టీమ్‌తో క‌లిసి ల‌డ‌క్ వెళ్ల‌డం ఒక మంచి ఎక్స్‌పీరియ‌న్స్ అన్నారు.



Next Story