అతడికి రుణపడి ఉంటానంటున్నా జబర్దస్త్ ఆది.!
Hyper Aadi Emotional in Jabardasth 400th Episode. జబర్దస్త్ షోలో పాల్గొనే కమెడియన్లు వారి స్కిట్ల ద్వారా అందరిని
By - Medi Samrat |
జబర్దస్త్ షోలో పాల్గొనే కమెడియన్లు వారి స్కిట్ల ద్వారా అందరిని నవ్విస్తూ ఉంటారు. ఎప్పుడు ఎంతో సరదాగా సాగే జబర్దస్త్ వేదికపై ఈసారి కొంత ఎమోషన్ సీన్లు చోటుచేసుకున్నాయి. ఎన్నో కష్టాలను అనుభవించిన వారికి ఈ జబర్దస్త్ ద్వారా వారి జీవితం ఎలా మారిపోయిందో అనే సంఘటనలను ఈ వేదిక ద్వారా తెలియజేశారు. జబర్దస్త్ 400 వ ఎపిసోడ్ లో భాగంగా అందరిని ఎప్పుడు నవ్విస్తూ ఉండే ఆది, వెంకీ అనసూయ వారు పడిన కష్టాలను తెలియజేస్తూ కొంతవరకు ఎమోషన్ అయ్యారు.
వచ్చే గురువారం 400 ఎపిసోడ్ ప్రసారం కానున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ 400 ఎపిసోడ్ కు ప్రదీప్ గెస్ట్ గా రావడంతో పాటు, హైపర్ ఆది పంచ్ డైలాగులకుతో ఎంతో సరదాగా సాగే స్కిట్ లో ఆదికి తోడు యాంకర్ ప్రదీప్ కలిసి తన స్కిట్ లో కలిసి నటిస్తే ఎన్ని పంచు డైలాగులు వస్తాయా మనకు అర్థమవుతుంది. ఇందులో భాగంగానే ప్రదీప్ పెళ్లి గురించి వరుస పంచ్ డైలాగులతో అందరిని కడుపుబ్బ నవ్వించారు. వీటిని దృష్టిలో పెళ్ళంటే చేసుకుందాం.... అనే ఆశతో మొదలుపెట్టి... చూసుకుందాం అని ఆవేశం వరుకు వెళ్లి చివరకు మూసుకుందాం.... అని ఫిక్స్ అవుదాం అంటూ ఎంతో సరదాగా అందరినీ ఆకట్టుకున్నారు.
హైపర్ ఆది, యాంకర్ ప్రదీప్, అనసూయ రోజా వరుస పంచ్ లతో ఎంతో సందడి చేశారు. వీరే కాకుండా వెంకీ మంకీస్, రాకెట్ రాఘవ, చలాకి చంటి, తాగుబోతు రమేష్ స్కిట్లు ఈవారం ఎంతో సందడి చేశారు. జబర్దస్త్ సెట్ లో నవ్వులు పూయించిన ఈ ఎపిసోడ్ చూడాలంటే వచ్చే గురువారం వరకు ఎదురు చూడాల్సిందే. అయితే వీరి సరదా మాటలను తాజాగా విడుదలైన ప్రోమోలో మనం చూడవచ్చు.