పునీత్ రాజ్ కుమార్ మరణం.. ఆ డాక్టర్ తప్పేనంటూ ప్రచారం చేస్తుండడంతో..!

Hospital association seeks protection for actor Puneeth's doctor. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు

By Medi Samrat  Published on  7 Nov 2021 10:40 AM GMT
పునీత్ రాజ్ కుమార్ మరణం.. ఆ డాక్టర్ తప్పేనంటూ ప్రచారం చేస్తుండడంతో..!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తీరని లోటు. చాలా మంది ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ రాజ్ కుమార్ మరణానికి ఫ్యామిలీ డాక్టర్ నిర్లక్ష్యమే కారణమంటూ అభిమానులు పోలీసులను ఆశ్రయించారు. పునీత్ ఫ్యామిలీ డాక్టర్ రమణారావును వెంటనే అరెస్ట్ చేయాలంటూ బెంగళూరు సదాశివనగర పోలీసులకు రెండు ఫిర్యాదులు అందాయి. దాంతో డాక్టర్ రమణారావు స్పందించారు. అక్టోబరు 29న పునీత్, ఆయన భార్య తన క్లినిక్ కు వచ్చారని.. ప్రాథమిక చికిత్స చేసి నగరంలోని విక్రమ్ ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా సూచించానని తెలిపారు. వైద్యచికిత్స పరంగా తన లోపం ఏమీలేదని ఆయన స్పష్టం చేశారు. విక్రమ్ హాస్పిటల్‌లోని డాక్టర్లు కూడా చర్యలు తీసుకున్నారని చెప్పారు.

ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు డాక్టర్ రమణారావు క్లినిక్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పునీత్ అభిమానులు ఆయనపై దాడి చేసే అవకాశం ఉందని భావించి భద్రత కల్పించారు. జిమ్ లో వర్కౌట్లు చేస్తూ అస్వస్థతకు గురైన పునీత్ రాజ్ కుమార్ విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. రమణారావుపై పునీత్ అభిమానులు నిరసనలు, ఫిర్యాదులు చేయడంతో ఆయనకు రక్షణ కల్పించాలని కర్ణాటకలోని ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ (PHANA) నవంబర్ 6 శనివారం నాడు పోలీసులను కోరింది. పునీత్ రాజ్‌కుమార్ మరణం తర్వాత మీడియా మరియు పబ్లిక్‌లో హెల్త్‌కేర్ చిత్రీకరించబడుతున్న తీరుపై PHANA తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. "మేము ఒక యువ, ప్రముఖ నటుడిని కోల్పోయిన బాధలో ఉన్నాము.. ఆ బాధ మా అందరికీ తెలుసు.. ఈ సంఘటనలు విచారకరం.. వైద్యులపై దాడుల విషయమై మీరు చర్యలు తీసుకోవాలి'' అని ఫనా అధ్యక్షుడు ప్రసన్న హెచ్‌ఎం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని కోరారు.


Next Story