హిట్-2 కు మొదటిరోజు.. భారీ కలెక్షన్స్..!

HIT-2 Movie First Day Collections. టాలీవుడ్ యంగ్‌ హీరో అడివి శేష్ హీరోగా నటించిన ‘హిట్-2’ రిలీజై బ్లాక్‌బస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది.

By Medi Samrat  Published on  3 Dec 2022 4:45 PM IST
హిట్-2 కు మొదటిరోజు.. భారీ కలెక్షన్స్..!

టాలీవుడ్ యంగ్‌ హీరో అడివి శేష్ హీరోగా నటించిన 'హిట్-2' రిలీజై బ్లాక్‌బస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. సైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా 2020లో విడుదలై ఘన విజయం సాధించిన హిట్‌ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. మొదటి పార్ట్‌లో విశ్వక్‌ హీరోగా నటించగా.. రెండవ పార్టులో అడివిశేష్ ప్రధాన పాత్రలో నటించాడు. టీజర్‌, ట్రైలర్‌లు సినిమాపై భారీ అంచనాలు క్రియేట్‌ చేయగా.. అందుకు తగ్గట్టే సినిమాకు మంచి టాక్ రావడంతో.. భారీ స్థాయిలో ఈ సినిమా ఓపెనింగ్స్ రాబట్టింది.

హిట్-2 మూవీ మొదటి రోజు రూ.11.27 కోట్ల గ్రాస్‌ను, రూ.6.43 కోట్ల షేర్‌ను కలెక్ట్‌ చేసింది. అడివి శేష్‌ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా హిట్-2 నిలిచింది. ఈ సినిమాకు దాదాపు రూ.15 కోట్ల వరకు ప్రీ రిలీజ్‌ బిజినెస్ జరిగింది. బ్రేక్‌ ఈవెన్ కోసం ఈ సినిమా మరో రూ.8.57 కోట్లు సాధించాల్సి ఉంటుంది. ఫస్ట్‌ వీకెండ్‌లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ పూర్తి చేయడం కష్టమేమీ కాదు. ఈ చిత్రంలో అడివిశేష్‌కు జోడీగా మీనాక్షీ చౌదరీ నటించింది. కోమలి ప్రసాద్‌, రావు రమేష్‌ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని నిర్మించారు.


Next Story