'దిశ ఎన్‌కౌంటర్' చిత్రంపై హైకోర్టు విచారణ

High Court Issues Notices To Disha Movie Unit. సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న ‘దిశ ఎన్ కౌంటర్’ సినిమా

By Medi Samrat  Published on  16 Nov 2020 4:58 PM GMT
దిశ ఎన్‌కౌంటర్ చిత్రంపై హైకోర్టు విచారణ

సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న 'దిశ ఎన్ కౌంటర్' సినిమా ఆపాలంటూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. దిశ చిత్రాన్ని నిలిపివేయాలంటూ దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి హైకోర్టులో రిట్ అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. దిశ తండ్రి దాఖలు చేసిన అప్పీలుపై ధర్మాసనం విచారణ జరిపింది.

మహిళ పై జరిగిన అత్యాచారం, హత్యను కథగా చేస్తూ అర్జీవి తీస్తున్న సినిమాను నిలిపి వేయాలని పిటీషనర్ తరపు న్యాయవాది అరుణ కుమారి కోర్టును కోరారు. బాధితులు, నిందితుల కుటుంబ సభ్యులు జ్యూడిషియల్ కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేసారని అరుణ కుమారి కోర్టుకు తెలిపారు.

అలాగే.. యూట్యూబ్ లో అప్‌లోడ్ చేసిన‌ దిశ ట్రైలర్ వెంటనే తీసివేసేలా ఆదేశాలు ఇవ్వాలని అరుణ కుమారి కోర్టును కోరారు. ఈ చిత్రం విడుదల కావడం వలన కుటుంబ సభ్యుల‌ మనోభావాలు దెబ్బతింటున్నాయని పిటీషనర్ అడ్వొకేట్ కోర్టుకు తెలిపింది. ఒకవైపు జ్యుడీషియల్ కమిషన్ విచారణ చేపడుతున్న నేపథ్యంలో చిత్రాన్ని ఎలా తీస్తారని.. చిత్రాన్ని విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అరుణ కుమారి కోరారు.

వాద‌న‌లు విన్న సీజే.. ఏడుగురిని ప్రతివాదులగా చేరుస్తూ వారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆపై తదుపరి విచారణను కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.



Next Story