బుర్ఖా వేసుకుని సీక్రెట్‌గా సినిమా చూసిన‌ సాయి పల్లవి

Heroine Sai Pallavi Secretly Watches Shyam Singha Roy Movie. నాని, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ సినిమా 'శ్యామ్ సింగరాయ్'.

By Medi Samrat  Published on  30 Dec 2021 6:06 AM GMT
బుర్ఖా వేసుకుని సీక్రెట్‌గా సినిమా చూసిన‌ సాయి పల్లవి

నాని, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ సినిమా 'శ్యామ్ సింగరాయ్'. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాను చూడడానికి సాయి పల్లవి సినిమా థియేటర్ కు వెళ్లడం విశేషం. హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్ లో ప్రేక్షకుల మధ్య సాయి పల్లవి సినిమాను చూసింది. బుర్ఖా వేసుకుని మరీ వెళ్ళింది. సినిమా అంతా చూసేసి వచ్చాక థియేటర్ ముందు ముఖానికి ఉన్న ముసుగును తొలగించింది సాయి పల్లవి.


బుధవారం హైదరాబాద్‌ ముసాపేటలోని శ్రీరాములు థియేటర్‌కు డైరెక్టర్‌ రాహుల్‌తో కలిసి థియేటర్‌కు వెళ్లింది. బుర్ఖా ధరించి ప్రేక్షకుల మధ్య ఉండి సినిమా చూసింది. ప్రేక్షకులు ఎవరూ గుర్తుపట్టలేదు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. నాని హీరోగా రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'శ్యామ్ సింగరాయ్'హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి మరో హీరోయిన్ గా నటించింది.


Next Story
Share it