హీరోయిన్ కు ఎదురైన ఇబ్బందికరమైన ప్రశ్న.. అయినా కూడా..

బంగార్రాజు, జాంబి రెడ్డి సినిమాలలో నటించిన దక్షా నాగార్కర్ తన గ్లామర్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

By Medi Samrat  Published on  6 Feb 2024 6:45 PM IST
హీరోయిన్ కు ఎదురైన ఇబ్బందికరమైన ప్రశ్న.. అయినా కూడా..

బంగార్రాజు, జాంబి రెడ్డి సినిమాలలో నటించిన దక్షా నాగార్కర్ తన గ్లామర్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుంది ఈ అమ్మడు. తాజాగా అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన ఈ అమ్మడికి ఓ ఇబ్బందికరమైన ప్రశ్న ఎదురైంది. ఆమె తొడల గురించి ఓ అభిమాని మాట్లాడాడు.

ఇన్‌స్టాగ్రామ్ లో దక్షా కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉండగా.. ఓ ఫ్యాన్ "నీ తొడలకు పెద్ద అభిమానిని. వాటి సీక్రెట్ ఏంటి?" అని ప్రశ్నించాడు. దీనికి దక్ష స్పందిస్తూ.. "ఎందుకంటే నేను మసాలా వడలు తింటాను కాబట్టి" అని నవ్వుతూ చెప్పేసింది. ఆమె ఇచ్చిన సమాధానం చాలా మంది ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. మీ తర్వాతి ప్రాజెక్టుల గురించి చెప్పండి అని అడిగితే.. తాను ప్రస్తుతం మూవీ సెట్స్ లోనే ఉన్నానని చెప్పింది. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన పలు విషయాలపై దక్షా స్పందించింది.

Next Story