త‌న‌కు ఏమైందో.. ఇన్ని రోజులు ఎంత బాధపడిందో వివరించిన నభా

Heroine Nabha Natesh Escapes Major Accident. నభా నటేష్.. ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా తెలుగులో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.

By Medi Samrat
Published on : 10 Jan 2023 7:23 PM IST

త‌న‌కు ఏమైందో.. ఇన్ని రోజులు ఎంత బాధపడిందో వివరించిన నభా

నభా నటేష్.. ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా తెలుగులో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలువురు యంగ్ హీరోలతో సినిమాల్లో ఛాన్స్ లను దక్కించుకుంది. కానీ గత ఏడాది ఉన్నట్లుండి సినిమాను తగ్గించేసింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంది. తాను సినిమాలను తగ్గించేయడానికి కారణం తనకు జరిగిన ఓ యాక్సిడెంట్ అని నభా చెప్పుకొచ్చింది.

గత ఏడాది తనకి యాక్సిడెంట్ అయిందనీ, ఎడమ భుజం దగ్గర బోన్స్ విరగటం వలన సర్జరీలు జరిగాయని చెప్పింది. ఈ కారణంగానే తాను సినిమాలకి దూరంగా ఉండవలసి వచ్చిందని చెప్పింది. నిజంగా అది చాలా కష్టతరమైన పరిస్థితి. దానిని దాటుకుని మళ్లీ సినిమాలు చేయడానికి ట్రై చేయడం అంత తేలికైన పనేం కాదు. కానీ మీ అందరి అభిమానం వలన నేను త్వరగా కోలుకున్నాను. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తానని తాజాగా ఆమె ఒక లెటర్ రాసింది. 'మ్యాస్ట్రో' తరువాత ఆమె తెలుగు తెరపై ఆమె కనిపించలేదు.



Next Story