ది వారియర్.. సినిమా కలెక్షన్స్ ఎంతంటే..?
Hero Ram Pothineni Warrior Movie Collections. రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో వచ్చిన 'ది వారియర్'..
By Medi Samrat Published on 21 July 2022 12:14 PM GMTNext Story
రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో వచ్చిన 'ది వారియర్'.. ఈ నెల 14వ తేదీన థియేటర్లకు వచ్చింది. కృతి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ప్రతినాయకుడి పాత్రను ఆది పినిశెట్టి పోషించాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి బాణీలను అందించాడు. మొదటి రోజు మంచి కలెక్షన్స్ సాధించింది. 6 రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 24.50 కోట్ల గ్రాస్ ను .. 15.93 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, 31.05 కోట్ల గ్రాస్ ను .. 18.43 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంకా 20 కోట్లను రాబడితే బ్రేక్ ఈవెన్ కి చేరుకుంటుందని అంటున్నారు.
తెలుగు, తమిళ భాషల్లో బై లింగ్వల్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను రామ్ కెరీర్‌లోనే అత్యధిక థియేటర్స్‌లో విడుదలైంది. ఇక ఈ సినిమాను మల్లీప్లెక్స్‌లో రూ. 295, మాములు సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 175 రేట్లతో విడుదల చేశారు. దీంతో ఈ సినిమా టికెట్ రేట్లపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సినిమాను తెలంగాణలో ప్రభుత్వం నిర్ణయించిన భారీ ధరలకే ఈ సినిమాను విడుదల చేాసారు. ఫస్ట్ డే కలెక్షన్స్ బాగానే వచ్చినా.. ఆ తర్వాత రెండో రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్స్ పడిపోయాయి.