హీరో రామ్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు

Hero Ram Pothineni is getting married soon. టాలీవుడ్ యంగ్ హీరో రామ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు తెచ్చుకున్నాడు.

By Medi Samrat  Published on  27 Jun 2022 1:35 PM IST
హీరో రామ్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు తెచ్చుకున్నాడు. రామ్ పెళ్ళికి సంబంధించి గతంలో చాలా సార్లు వార్తలు వినిపించాయి. తాజాగా మరోసారి రామ్ పెళ్ళికి సంబంధించిన వార్తలు షికారు చేస్తూ ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం రామ్ పెళ్లి చేసుకోవడం పక్కా అని అంటున్నారు.

చాకొలేట్ బోయ్ రామ్ పోతినేని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. అది కూడా లవ్ మ్యారేజ్ అని అంటున్నారు. తన స్కూల్ మేట్ నే రామ్ ప్రేమించి పెళ్లాడబోతున్నట్టు సమాచారం. వీరి ప్రేమకు ఇరువురి కుటుంబాలు అంగీకారం తెలిపాయని కథనాలు వస్తున్నాయి.

ఈ ఏడాది ఆగస్ట్ లో కానీ, సెప్టెంబర్ లో కానీ పెళ్లి జరగవచ్చని.. పెళ్లి తేదీలకు సంబంధించి రామ్ కుటుంబ సభ్యులు త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక రామ్ తాజా చిత్రం 'వారియర్' జులై 14న విడుదల కాబోతోంది. సినిమా విడుదలైన తర్వాత వీరి ఎంగేజ్ మెంట్ జరగనుంది.











Next Story