హీరో రాజశేఖర్ ఫ్యామిలీ కొన్నిరోజుల క్రితం మహమ్మారి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. రాజశేఖర్ కుమార్తెలు శివానీ, శివాత్మిక, బార్య జీవిత కరోనా బారి నుండి త్వరగానే కోలుకుని బయటపడ్డారు. అయితే హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి మాత్రం విషమంగా మారింది. అయితే రాజశేఖర్ ఆరోగ్యం పట్ల సిటీ న్యూరో సెంటర్ డాక్టర్లు ఎప్పటికప్పుడు కేర్ తీసుకుని ట్రీట్‌మెంట్ అందించారు.
రాజశేఖర్ ఆరోగ్యం బాగుపడాలని సినీ అభిమానులు ప్రార్థనలు కూడా చేశారు. సినీపెద్దలు కూడా రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తాజాగా కరోనా నెగటివ్ రిపోర్ట్ రావడంతో రాజశేఖర్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. అయితే కరోనాను జయించి వారియర్స్‌గా మారిన రాజశేఖర్ అండ్ ఫ్యామిలీ శనివారం నాడు దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు.
వేడుకల్లో భాగంగా రాజశేఖర్, జీవిత, ఇద్దరు పిల్లలు కలిసి ఫొటో దిగారు. నాన్న త్వరగా కోలుకుంటున్నారు. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు అంటూ శివాత్మిక రాజశేఖర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాజశేఖర్ అండ్ ఫ్యామిలీ ఫోటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. తమ అభిమాన హీరో కరోనా నుండి కోలుకోవడంతో అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.