'హరి హర వీర మల్లు' నుండి అదిరిపోయే వీడియో

Hari Hara Veera Mallu The Warrior's Way. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం 'హరి హర వీర మల్లు' సినిమాకు సంబంధించిన వీడియోను..

By Medi Samrat  Published on  10 April 2022 10:00 AM GMT
హరి హర వీర మల్లు నుండి అదిరిపోయే వీడియో

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం 'హరి హర వీర మల్లు' సినిమాకు సంబంధించిన వీడియోను.. చిత్ర నిర్మాతలు విడుదల చేసారు. ఇందులో పవన్ కళ్యాణ్ ఫైట్స్ కోసం కష్టపడుతూ ఉన్న వీడియోను మనం చూడవచ్చు. మార్షల్ ఆర్ట్స్‌ నిపుణులచే శిక్షణ తీసుకుంటూ పవన్ కళ్యాణ్ కనిపించారు. అందుకు సంబంధించిన ప్రీ-షూట్ ప్రాక్టీస్‌ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.


వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు మంచి రెస్పాన్స్ ను అందుకున్నా.. 'హరి హర వీర మల్లు' పై మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. ఈ జానర్ ను ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ టచ్ చేయకపోవడంతో.. చాలా హైప్ క్రియేట్ చేయబడింది. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉండడంతో పవన్ కళ్యాణ్ చాలా ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కొంతమంది శిక్షణ పొందిన నిపుణులతో కలిసి పవన్ కర్రలతో ఫైట్ ప్రాక్టీస్ చేయడం చూడవచ్చు. రానా దగ్గుబాటితో కలిసి 'భీమ్లా నాయక్'లో కనిపించిన పవన్, 'కంచె' ఫేమ్ క్రిష్ దర్శకత్వం వహించిన 'హరి హర వీర మల్లు'లో టైటిల్ రోల్‌లో కనిపించనున్నారు. నటి నిధి అగర్వాల్ పవన్ సరసన కథానాయికగా నటిస్తుండగా, మేకర్స్ ఈ చిత్రంలో భారీ స్టార్ కాస్ట్ ఉండేలా చూసుకుంటూ ఉన్నారు.


Next Story
Share it