పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు — పార్ట్ 1 చిత్ర నిర్మాతలు జూలై 24న విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను కూడా ఇటీవల విడుదల చేశారు. ఇప్పుడు హరి హర వీర మల్లు ప్రీ-రిలీజ్ ఈవెంట్ వివరాలు బయటకు వచ్చాయి. సినిమాకు సంబంధించిన వ్యాపార చర్చలన్నీ పంపిణీదారులతో జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో అన్నీ సర్దుకుంటుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.
త్వరలోనే సినిమాకు సంబంధించి పూర్తి స్థాయి ప్రమోషన్‌లను ఆశించవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు ప్రీ-రిలీజ్ ఈవెంట్ వివరాలు బయటకు వచ్చాయి. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జూలై 20న వైజాగ్‌లో జరగనుందని చెబుతున్నారు. త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.