అధికారికంగా వాయిదా పడ్డ 'హరిహర వీరమల్లు'

పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీర మల్లు సినిమా షూటింగ్ ఆలస్యం కావడం, విడుదల తేదీల కారణంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది.

By Medi Samrat
Published on : 6 Jun 2025 2:58 PM IST

అధికారికంగా వాయిదా పడ్డ హరిహర వీరమల్లు

పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీర మల్లు సినిమా షూటింగ్ ఆలస్యం కావడం, విడుదల తేదీల కారణంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. హరి హర వీర మల్లు సినిమా వాయిదా పడిందని నిర్మాతలు అధికారికంగా ధ్రువీకరించారు. సినిమా విడుదల కొంచెం ఆలస్యం అయినప్పటికీ, అది చరిత్ర సృష్టిస్తుందని నిర్మాతలు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు సినిమా వాయిదా పడింది, విడుదల తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని చిత్ర బృందం తెలిపింది.

‘హరి హర వీర మల్లు’ ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. ఈ సినిమా విడుదల గురించి జరుగుతున్న ప్రచారాలు మరియు పెరుగుతున్న ఊహాగానాల నేపథ్యంలో నిర్మాతలు అధికారిక ప్రకటన విడుదల చేశారు. జూన్ 12వ తేదీ నాటికి సినిమాను మీకు అందించడానికి మేము అవిశ్రాంతంగా ప్రయత్నిస్తున్నాము, అయితే ఆ తేదీ నాటికి సినిమాను థియేటర్లకు తీసుకురాలేకపోతున్నామని నిర్మాతలు తెలిపారు.

Next Story