'వల్గర్‌ ఆంటీ' అంటూ జెనీలియాపై కామెంట్లు.. ఏమని సమాధానం ఇచ్చిందంటే..

Genelia Deshmukh Reacts On Trolls. రితేశ్‌ దేశ్‌ముఖ్, నటి జెనీలియా డిసౌజా కపుల్ ఎంతో క్యూట్ గా ఉంటుంది. వీరిద్దరూ కలిసి

By Medi Samrat  Published on  29 Sept 2021 2:30 PM IST
వల్గర్‌ ఆంటీ అంటూ జెనీలియాపై కామెంట్లు.. ఏమని సమాధానం ఇచ్చిందంటే..

రితేశ్‌ దేశ్‌ముఖ్, నటి జెనీలియా డిసౌజా కపుల్ ఎంతో క్యూట్ గా ఉంటుంది. వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉంటారు. ఫన్నీగా.. రొమాంటిక్ గా ఎప్పటికప్పుడు ఈ జంట వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటారు. చాలా వరకూ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. వారి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవ్వగా కొందరు నెటిజన్లు 'వల్గర్‌ ఆంటీ' అంటూ ట్రోల్‌ చేశారు. రితేశ్‌, జెనీలియా జంట ఓ షోలో అతిథులుగా వచ్చారు. దీంట్లో సెలబ్రిటీలు ట్రోల్‌కి సంబంధించిన కామెంట్స్‌ని చదివి వారి రెస్పాన్స్‌ ఇవ్వాలి. ఈ జంటకి సైతం ఓ వీడియో చూపించాడు. అందులో నటి ప్రీతి జింటాని రితేశ్‌ చేతులపై ముద్దు పెట్టకోగా, జెనీలియా జలసీతో చూస్తూ ఉంది. ఇంటికి వెళ్లిన తర్వాత జెనీలియా కోపంతో భర్తను కొడుతున్నట్లు, ఆయన వద్దు అని వేడుకుంటున్నట్లు ఉన్న ఆ వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌ అయ్యింది.

ఈ వీడియో కింద ఎంతో మంది కామెంట్లు చేశారు. ఓ నెటిజన్‌ 'సిగ్గు లేదా, వల్గర్‌ ఆంటీ. ఎప్పుడూ ఓవర్‌ యాక్టింగ్ చేస్తుంటావ్‌. ఇది నీ ముఖానికి సెట్‌ అవ్వదు' అని కామెంట్‌ పెట్టాడు. దీనిని ఆ షోలో చదివి వినిపించారు. దానిపై స్పందించిన జెనీలియా 'అతని ఇంట్లో పరిస్థితులు బాలేనట్లు ఉన్నాయి అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. భాయ్ సాబ్, మీరు ఇంట్లో బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను' అంటూ ఘాటుగా స్పందించింది. జెనీలియా చూడడానికి క్యూట్ గా ఉంటుంది కానీ.. ఇలాంటి విమర్శలు చేస్తే మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తూ ఉంటుంది.


Next Story