'గతం' సినిమా.. అరుదైన ఘనత

‘Gatham’ Makes Rare Feat. ‘గతం’ సినిమా.. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమాకు మంచి పేరు వచ్చింది.

By Medi Samrat  Published on  19 Dec 2020 10:25 AM GMT
గతం సినిమా.. అరుదైన ఘనత

'గతం' సినిమా.. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమాకు మంచి పేరు వచ్చింది. కొత్త తరహా సినిమా చూడాలి అని అనుకునేవాళ్లకు ఈ సినిమా మంచి అనుభవాన్ని ఇస్తుంది. ఈ సినిమా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో(IFFI)లోని ఇండియన్ పనోరమా కేటగిరీలో ప్రదర్శితం కానున్న ఏకైక తెలుగు సినిమాగా నిలిచింది. జనవరి 17న గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఫంక్షన్‌లో పనోరమా కేటగిరీలో ప్రదర్శితమయ్యే సినిమాగా స్థానాన్ని సంపాదించుకోవడం విశేషం. ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఇండియన్ పనోరమా ఒక ప్రధాన భాగం. బెస్ట్ ఇండియన్ సినిమాలను ఇందులో ప్రదర్శిస్తూ ఉంటారు. ఉత్తమ భారతీయ సినిమాలను ప్రోత్సహించేందుకు గాను 1978లో దీనిని ప్రవేశపెట్టారు. ఇప్పుడు గతం సినిమాకు అవకాశం దక్కడం విశేషం.

నవంబర్ 6న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదలైంది. థ్రిల్లర్ కథాంశంతో కిరణ్ కొండమడుగుల దీనిని తెరకెక్కించారు. భార్గవ పోలుదాసు, రాకేష్ గాలేభే, పూజిత కురపర్తి ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. భార్గవ పోలుదాసు, సృజన్ యర్రబోలు, హర్ష వర్ధన్ ప్రతాప్‌లు కలిసి ఈ సినిమాను నిర్మించారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా.. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఇచ్చారు. సస్పెన్స్, ట్విస్టులతో సాగే ఈ సినిమాను మీరు మిస్ అయ్యి ఉంటే.. ప్రైమ్ వీడియోలో మీరు చూసేయొచ్చు.


Next Story