రాజ్‌కుంద్రాపై సొంత ఉద్యోగులే వ్యతిరేక సాక్ష్యం..!

Four Employees of Viaan Industries May Turn Witness Against Raj Kundra in Pornography Case. బాలీవుడ్ పోర్న్ వీడియోల కేసులో బాలీవుడ్

By Medi Samrat  Published on  26 July 2021 11:31 AM IST
రాజ్‌కుంద్రాపై సొంత ఉద్యోగులే వ్యతిరేక సాక్ష్యం..!

బాలీవుడ్ పోర్న్ వీడియోల కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను ఇటీవలే అరెస్టు చేశారు. ఇప్పటికే విచారణలో పలు అంశాలు బయటకు వచ్చాయి. రాజ్ కుంద్రా HotHit యాప్ నుండి రోజుకు ఒకటి నుండి 10 లక్షల రూపాయలు సంపాదించేవారని కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. అరెస్ట్‌ చేయకుండా ఉండేందుకు పోలీసులకు రాజ్ కుంద్రా ఏకంగా రూ.25 లక్షలు లంచంగా ఇచ్చారని.. ఈ విషయాన్ని ఇదే కేసులో నిందితుడిగా ఉన్న అరవింద్‌ శ్రీవాత్సవ అలియాస్‌ యశ్‌ ఠాకూర్‌ పోలీసులకు పంపిన ఓ మెయిల్‌లో ఆరోపించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అరవింద్‌ శ్రీవాత్సవను అరెస్ట్‌ చేయడానికి ప్రయత్నించగా రాజ్‌ కుంద్రా మాదిరి మీరు కూడా రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు మార్చిలో ఏసీబీకి పంపిన ఈమెయిల్‌లో తెలిపారు. అమెరికాకు చెందిన ఫ్లిజ్‌ మూవీస్‌ సంస్థకు సీఈఓగా ఉన్న అరవింద్‌ శ్రీవాత్సవ ఏసీబీకి ఈమెయిల్‌ చేశారు.

పోలీసు క‌స్ట‌డీలో ఉన్న రాజ్‌కుంద్రాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్ప‌డానికి రాజ్‌కుంద్రా కంపెనీలో ప‌ని చేస్తున్న ఉద్యోగులు ముందుకు వ‌చ్చార‌ని నేషనల్ మీడియా చెబుతోంది. ఇందుకోసం వారు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (సీబీఐ)ని సంప్రదించార‌ని కథనాలు వచ్చాయి. రాజ్ కుంద్రా వ్యాపార లావాదేవీల ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీల కీలక డేటా బయటకు రావాలి. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించ‌డానికి ఆయ‌న స‌హ‌క‌రించ‌డం లేద‌ని ముంబై పోలీసులు ఆరోపిస్తున్నారు. కుంద్రాకు వ్య‌తిరేకంగా సాక్ష్యం చెప్ప‌డానికి ముందుకు వ‌చ్చిన నలుగురు ఉద్యోగులు ఈ కేసులో కీల‌కంగా మార‌నున్నార‌ని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. త్వ‌ర‌లో మేజిస్ట్రేట్ ముందు వీరి వాంగ్మూలాల‌ను పోలీసులు రికార్డు చేయ‌నున్నారు. ఏది ఏమైనా రాజ్ కుంద్రా వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది.


Next Story