సాయి పల్లవి చెల్లెలు ఎంట్రీ.. మొదటి చిత్రం ఏమిటంటే..!

First look of 'Chithirai Sevvaanam' released. సాయి పల్లవి.. ప్రస్తుతం తనకు పాత్ర నచ్చితే చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అనే

By Medi Samrat  Published on  22 Nov 2021 12:33 PM IST
సాయి పల్లవి చెల్లెలు ఎంట్రీ.. మొదటి చిత్రం ఏమిటంటే..!

సాయి పల్లవి.. ప్రస్తుతం తనకు పాత్ర నచ్చితే చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అనే తేడా లేకుండా నటించుకుంటూ వెళుతోంది. ఫిదా, లవ్ స్టోరీ సినిమాలతో భారీగా అభిమానులను సొంతం చేసుకుంది. అప్పుడప్పుడు సాయి పల్లవి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తన చెల్లెలుకు సంబంధించిన ఫోటోలను పోస్టు చేస్తూ ఉంటుంది. ఆమె పేరు.. పూజ కన్నన్. ఇప్పుడు ఆమె కూడా కథానాయికగా ఎంట్రీ ఇస్తోంది. యాక్షన్ కొరియోగ్రఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న 'సిల్వా' దర్శకుడిగా 'చితిరై సెవ్వానం' అనే సినిమాను రూపొందించాడు. తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ ఈ కథ నడుస్తుంది. తండ్రి పాత్రలో సముద్రఖని.. కూతురు పాత్రలో పూజ కన్నన్ కనిపించనున్నారు.

అమృత స్టూడియోస్ వారు ఈ సినిమాను నిర్మించారు. జీ 5 తమిళంలో ఈ సినిమా డిసెంబర్ 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. సామ్ సీఎస్ సంగీతాన్ని అందించారు. చితిరై సెవ్వానం రిలీజ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో సముద్రకని మరియు పూజా కన్నన్‌లు తండ్రీకూతుళ్లుగా సైకిల్‌పై వెళ్తున్నారు. ఈ చిత్రం ఎమోషనల్ రైడ్‌ గా ఉండబోతోందని అందరూ భావిస్తూ ఉన్నారు. సాయి పల్లవి తరచుగా తన సోదరి గురించి గొప్పగా చెబుతూ ఉంటుంది. ఈ సినిమా ద్వారా నటిగా ఆమె తన సత్తాను నిరూపించుకోబోతోందని తెలుస్తోంది. పూజా గతంలో దర్శకుడు AL విజయ్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసింది. 2017లో విడుదలైన కారా అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది.


Next Story