మంచి నిర్ణయం తీసుకున్న మేజర్ టీమ్.. మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్

Finally ‘Major’ Solution To Ticket Prices Issue. గత కొద్ది నెలలుగా విడుదలైన తెలుగు సినిమాలకు భారీగా టికెట్ల రేట్లను పెంచిన సంగతి తెలిసిందే

By Medi Samrat  Published on  27 May 2022 9:15 PM IST
మంచి నిర్ణయం తీసుకున్న మేజర్ టీమ్.. మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్

గత కొద్ది నెలలుగా విడుదలైన తెలుగు సినిమాలకు భారీగా టికెట్ల రేట్లను పెంచిన సంగతి తెలిసిందే..! తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు బడా నిర్మాతల డిమాండ్, హీరోలతో ఉన్న సాన్నిహిత్యం మేరకు సినీ ప్రియులకు షాకిచ్చేలా నిర్ణయాలు తీసుకున్నాయి. తమిళ సినిమాలకు చెన్నైలో రేట్ కంటే.. హైదరాబాద్ లోనే ఎక్కువ ఉన్న విషయం కూడా సినీ లవర్స్ కు అసంతృప్తిని కలిగించింది. వరుసగా భారీ సినిమాలు విడుదలవ్వడంతో కొన్ని సినిమాలకు కనీస కలెక్షన్స్ దక్కలేదు. రాబోయే సినిమాలకు కూడా ఆ ఎఫెక్ట్ పడే అవకాశం ఉండడంతో కొత్త సినిమా నిర్మాతలు కాస్త అలర్ట్ అవుతున్నారు.

మంచి అంచనాలున్న సినిమాలలో 'మేజర్' ఒకటి. తాజాగా తమ సినిమా టిక్కెట్ రేట్ల‌ని త‌గ్గిస్తున్న‌ట్లు ప్రకటించింది మేజ‌ర్ చిత్ర యూనిట్. శేష్ అడవి హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో సయీ మంజ్రేక‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. శోభితా ధూళిపాల కీల‌క‌పాత్ర‌లో న‌టించింది. జీఎంబీ ఎంట‌ర్టైన‌మెంట్స్‌, సోనీ పిక్చ‌ర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ+ఎయ‌స్ మూవీస్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించిన.. ఈ చిత్రానికి శ‌శికిర‌ణ్ టిక్కా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రం జూన్ 3న విడుద‌ల కానుంది. చిత్ర బృందం టిక్కెట్ రేట్ల‌ను త‌గ్గిస్తూ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ వేసింది. అతి త‌క్కువ రేట్ల‌తో ఈ చిత్రం ప్ర‌ద‌ర్శితం కానుంది. తెలంగాణ‌లో సాధార‌ణంగా మ‌ల్టీప్లెక్స్‌ల‌లో రూ.295, సింగిల్ స్క్రీన్‌ల‌లో రూ. 175 ఉండేవి. మేజ‌ర్ చిత్రానికి రూ.100 త‌గ్గించి మ‌ల్టీప్లెక్స్‌ల‌లో రూ.195, సింగిల్ స్క్రీన్‌ల‌లో రూ.150 టిక్కెట్ రేట్లు ఉండనున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. ఇక ఆంధ్రాలో మ‌ల్టీప్లెక్స్‌లో రూ.177, సింగిల్ స్క్రీన్‌ల‌లో రూ.147 గా ఉండ‌నుంది. 'మేజ‌ర్ చిత్రాన్ని అంద‌రు చూడాలనే ఉద్ధేశ్యంతో త‌క్కువ రేట్ల‌కు సినిమాను ప్ర‌ద‌ర్శితం చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రజలకు బాగా నచ్చింది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల కానుంది.










Next Story