విషాదంలో సినీ ప‌రిశ్ర‌మ‌.. నిర్మాత క‌న్నుమూత

Film producer and chef Naushad passes away. మలయాళ సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ‌ నిర్మాత, చెఫ్‌ నౌషద్‌

By -  Medi Samrat
Published on : 27 Aug 2021 8:29 PM IST

విషాదంలో సినీ ప‌రిశ్ర‌మ‌.. నిర్మాత క‌న్నుమూత

మలయాళ సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ‌ నిర్మాత, చెఫ్‌ నౌషద్‌(55) క‌న్నుమూశారు. ఇటీవల కోవిడ్‌ బారిన పడిన నౌషద్ కోలుకున్నారు. ఉదర సంబంధిత నొప్పితో రెండు వారాలుగా తిరువల్లలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నేటి ఉదయం ఆరోగ్యం విషమించడంతో నౌషద్ తుదిశ్వాస విడిచిన‌ట్లు నౌష‌ద్‌ కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే.. ఈ నెల 12న నౌషద్‌ భార్య షీబా గుండెపోటుతో మరణించారు. 15 రోజుల వ్యవధిలోనే నౌషద్ కూడా క‌న్నుమూశారు. రోజుల వ్య‌వ‌ధిలో భార్యాభర్తలిద్దరూ మృతి చెందడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

నౌషద్, షీబా దంప‌తుల‌కు కూతురు నష్వా(13) ఉంది. తల్లిదండ్రులను కోల్పోయిన కూతురిని చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ది బిగ్‌ చెఫ్ పేరిట నౌషద్ రెస్టారెంట్ నెలకొల్పారు. పలు టీవీ చానెళ్లలో కుకరీ షోలతో అలరించారు నౌషద్‌. 2005 లో మమ్ముట్టి నటించిన కజా సినిమాతో నౌషద్‌ నిర్మాతగా మారారు. నిర్మాత‌గా చట్టంబి నాడు, లయన్‌, బెస్ట్‌ యాక్టర్‌, స్పానిష్‌ మసాలా వంటి చిత్రాలను తీశారు. నౌషద్‌ మృతి పట్ల సీఎం పినరయి విజయన్‌ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సినీ ప్రముఖులు కూడా సోషల్‌ మీడియా వేదికగా నౌష‌ద్‌కు నివాళులు అర్పించారు.


Next Story