శ్రీదేవి కుమార్తె షూటింగ్ ను అడ్డుకున్నారుగా..!

Farmer group halts Janhvi Kapoors shoot. కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు

By Medi Samrat
Published on : 14 Jan 2021 11:24 AM IST

శ్రీదేవి కుమార్తె షూటింగ్ ను అడ్డుకున్నారుగా..!

కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన తెలుపుతూ ఉన్నారు. పలువురు ప్రముఖులు కూడా రైతులకు మద్దతు తెలుపుతూ పోస్టులు పెడుతూ వచ్చారు. బాలీవుడ్‌ నటి, దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కూడా రైతులకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే ఆమె ఈ పోస్టు పెట్టకముందు కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి.

జాన్వీ కపూర్‌కు తాజాగా అన్నదాతల నిరసన సెగ తగిలింది. షూటింగ్‌ నిమిత్తం పంజాబ్‌కు వెళ్లిన ఆమెను కొంతమంది రైతులు అడ్డుకున్నారు. నరేంద్ర మోదీ సర్కారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేపట్టిన ఆందోళనలకు మద్దతు ఇవ్వాలని కోరడమే కాకుండా షూటింగ్‌ జరగనివ్వమని హెచ్చరికలు జారీ చేశారు. స్టార్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వంలో 'గుడ్‌లక్‌ జెర్రీ' సినిమా కోసం జనవరి 11న పంజాబ్‌లోని ఫతేఘర్‌ సాహిబ్‌లోని బస్సీ పఠానాకు వెళ్లింది. షూటింగ్ కు వెళ్లిన రైతులు.. తమ ఆందోళనకు జాన్వీ కపూర్‌ మద్దతు తెలపాలని కోరారు. ఆమె అందుకు అంగీకరించడంతో కాసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. జాన్వీ రైతులను సపోర్టు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టింది. జాన్వీ ప్రస్తుతం ఆమె 'గుడ్ లక్ జెర్రీ' అనే సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండగా.. యువ హీరో కార్తీక్ ఆర్యన్‌కు జోడిగా 'దోస్తానా 2'లో కూడా నటిస్తోంది. టాలీవుడ్ సినిమాలో కూడా జాన్వీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.




Next Story