నిధి అగర్వాల్‌కు ఓ రేంజ్‌లో చుక్కలు చూపించిన అభిమానులు!

Fans Followed Nidhi Agarwal In Rajamendry. సాధారణంగా సినీ సెలబ్రిటీస్ వస్తున్నారంటే అక్కడకు పెద్ద ఎత్తున అభిమానులు

By Medi Samrat  Published on  21 Dec 2020 6:34 AM GMT
నిధి అగర్వాల్‌కు ఓ రేంజ్‌లో చుక్కలు చూపించిన అభిమానులు!

సాధారణంగా సినీ సెలబ్రిటీస్ వస్తున్నారంటే అక్కడకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుని తమ అభిమాన నటులను చూసేందుకు ఎంతో తాపత్రయ పడుతుంటారు. ఎలాగైనా వారిని కలవాలని వారితో ఫోటోలు దిగాలని ఎంతో ఆశపడుతుంటారు. ఏదైనా షూటింగ్ నిమిత్తం తమ ప్రాంతాలకు వచ్చినప్పుడు, లేదా ఏదైనా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సెలబ్రిటీస్ వస్తున్నారంటే అక్కడికిభారీ ఎత్తున అభిమానులు చేరుకొని ఉంటారు. ఒక్కసారిగా అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో కొందరు సెలబ్రిటీస్ ఎంతో కంగారు పడి పోవడం మనం చూస్తూ ఉంటాం. తాజాగా ఇలాంటి సంఘటన నిధి అగర్వాల్ ఎదుర్కొన్నారు.

"సవ్యసాచి"ఈ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన నిధి తరువాత "మిస్టర్ మజ్ను", "ఇస్మార్ట్ శంకర్" వంటి చిత్రాలలో నటించి వరుస విజయాలను అందుకున్నారు. తన నటన ద్వారా ఎంతో మందిని ఆకట్టుకున్న నిధి అగర్వాల్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అశోక్ గల్లా కథానాయకుడిగా మనకు పరిచయం కానున్నారు. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం రాజమహేంద్రవరం వెళ్ళిన చిత్ర బృందం, అక్కడ నిధి అగర్వాల్ పై కొన్ని షెడ్యూల్ చేయాల్సి ఉండగా, షూటింగ్ లో పాల్గొనడానికి వచ్చిన ఈ బ్యూటీని ఒక్కసారిగా తన ఫ్యాన్స్ చుట్టుముట్టారు.ఆ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుందని తెలుసుకున్న అభిమానులు వారిని కలవడానికి పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి ఆమెతో ఫోటోలు తీసుకోవడానికి పోటీపడ్డారు. ఒకేసారి అంత మందిని చూసేసరికి కొద్దిగా కంగారు పడిన నిధి వారందరికీ అభివాదం చేస్తూ అక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అయితే ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా చుట్టుముట్టి నిధి మేడమ్ ఒక ఫోటో అంటూ కేకలు వేశారు.

ఒక్కసారిగా ఆమెను తన అభిమానులు పెద్ద ఎత్తున చుట్టుముట్టి ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడానికి దారికి అడ్డు పడిన కొంతమంది అభిమానులను బౌన్సర్లు పక్కకు పంపారు. చీకటి పడిన తన అభిమానులు అక్కడే వేచి ఉండటంతో ఆమె తన వాహనం నుంచి బయటకు వచ్చి అందరికీ హాయ్ చెప్పి పలకరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story